AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఆగిపోయిన ఐపీఎల్ మ‌ళ్లీ ప్రారంభం కానుంది.. ఎప్ప‌టి నుంచంటే..

IPL 2021: క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఇష్ట‌డే ఐపీఎల్ 2021 మ‌ధ్య‌లోనే ఆగిపోయిన విష‌యం తెలిసిందే. భార‌త్‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతోన్న‌కార‌ణంగా ఐపీఎల్‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తూ బీసీసీఐ కీల‌క...

IPL 2021: క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఆగిపోయిన ఐపీఎల్ మ‌ళ్లీ ప్రారంభం కానుంది.. ఎప్ప‌టి నుంచంటే..
Ipl 2021
Narender Vaitla
|

Updated on: May 25, 2021 | 6:45 PM

Share

IPL 2021: క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఇష్ట‌డే ఐపీఎల్ 2021 మ‌ధ్య‌లోనే ఆగిపోయిన విష‌యం తెలిసిందే. భార‌త్‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతోన్న‌కార‌ణంగా ఐపీఎల్‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తూ బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఐపీఎల్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తార‌న్న దానిపై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా కేవ‌లం 29 మ్యాచ్‌ల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో మిగ‌తా 31 మ్యాచ్‌లు ఎప్ప‌డు నిర్వ‌హిస్తార‌న్న‌దానిపై గ‌త కొన్నిరోజులుగా వార్తలు వ‌స్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజా స‌మాచారం ప్ర‌కారం ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. మిగ‌తా మ్యాచ్‌లోనే దుబాయ్‌లోనే నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. క‌రోనా ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆట‌గాళ్ల‌ను ఇంగ్లాండ్ బ‌బుల్ నుంచి దుబాయ్‌కి తీసుకెళ్ల‌నున్నారు. ఇక ఇదిలా ఉంటే వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ల పర్యటన కోసం భారత సెలెక్టర్లు 20 మంది కూడిన జంబో జట్టును ప్రకటించారు. జూన్ 18న మొదలయ్యే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో కోహ్లీసేన పోటీ పడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్ పూర్త‌యిన త‌ర్వాత ఆట‌గాళ్లు దుబాయ్ చేరుకోనున్నారు.

Also Read: Andhra Corona Case: క‌రోనా కార‌ణంగా ఏపీలో కొత్త‌గా 106 మరణాలు… పాజిటివ్, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి

DSSB Recruitment: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం..

Viral Video: మండుటెండ‌లో న‌డిరోడ్డుపై దాహంతో ఉన్న గ‌ద్ద‌కు నీళ్లు అందించిన బాట‌సారులు.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు