DSSB Recruitment: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం..

DSSB Recruitment 2021: నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 7236 పోస్టుల‌తో భారీగా ఉద్యోగాల...

DSSB Recruitment: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం..
Dssb Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: May 25, 2021 | 5:55 PM

DSSB Recruitment 2021: నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 7236 పోస్టుల‌తో భారీగా ఉద్యోగాల నియామ‌కం చేప‌ట్ట‌నుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు నేటి నుంచి (మంగ‌ళ‌వారం) ప్రారంభ‌మ‌వుతోన్న వేళ‌.. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు..

* టీజీటీ విభాగంలో 6258 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా హిందీ, నేచుర‌ల్ సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ సైన్స్‌, బెంగాలీ స‌బ్జెక్టులో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఏ(ఆన‌ర్స్), బ్యాచిల‌ర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సీటెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.

* ప్రైమ‌రీ, న‌ర్సరీ విభాగాల్లో మొత్తం 628 అసిస్టెంట్ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు న‌ర్సరీ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాంలో డిప్లొమా/ స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

* జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ (278) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేష‌న్/ సెకండ‌రీ స్కూల్ ఎగ్జామినేష‌న్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 ప‌దాలు, హిందీలో 30 ప‌దాలు టైపింగ్ స్పీడ్ నైపుణ్యం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

* కౌన్సిల‌ర్‌ (50) పోస్టుల‌కు అప్లై చేసుకునే అభ్య‌ర్థులు.. సైకాల‌జీ/ అప్లైడ్ సైకాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాల‌జీలో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ప‌ట్వారీ (10) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీతో పాటు ఉర్దూ/ హిందీలో పని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 21-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన ఖాళీల‌కు అభ్య‌ర్థుల‌ను వ‌న్ టైర్‌/ టూ టైర్ ఎగ్జామినేష‌న్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ తేదీ 25.05.2021 కాగా.. 24.06.2021 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: ICT Recruitment 2021: ముంబై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

Board Exams: విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టే ముందు ఆ పని చేయండి…. తెర‌పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చిన అఖిలేష్

Social Media: రేప‌టి నుంచి భార‌త్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌లు ప‌నిచేయవా..? అస‌లేం జ‌ర‌గ‌నుంది..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో