ICT Recruitment 2021: ముంబై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
ICT Recruitment 2021: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)..ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1,2 పోస్టులను...
ICT Recruitment 2021: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)..ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1,2 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తులకు నేడే (మంగళవారం) చివరి తేదీ. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ప్రాజెక్ట్ అసోసియేట్–1, 2 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
* సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. నెట్/గేట్ అర్హత పొంది ఉండాలి.
* నాలుగు ఏళ్ల సమయానికి గాను కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను తీసుకోనున్నారు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థుల దరఖాస్తులను షార్ట్‌లిస్టింగ్ చేసిన అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 25-05-2021ని (మంగళవారం) నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు www.ictmumbai.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Breaking: ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి.. గురువారం డివిజన్ బెంచ్ విచారణ