Breaking: ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి.. గురువారం డివిజన్ బెంచ్ విచారణ
ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్లపై గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది....
ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్లపై గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. నాటు మందు పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణకు అనుమతి ఇచ్చింది.
ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఈ మందు హాట్ టాపిక్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అటెన్షన్ మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపే ఉంది. ఆనందయ్య నాటు మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్ట రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా.. ఓ వ్యక్తికి ఆనందయ్య నాటు మందు ఇవ్వగా.. ఆయన వెంటనే కోలుకుని కనిపించాడు. దీంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన స్టూడెంట్ విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండ్ టీమ్ అక్కడ ఉండగానే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు మందు చుక్కలు వేశారు. అంతే 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
ఆనందయ్య నాటు మందుపై నటుడు జగపతిబాబు కీలక వ్యాఖ్యలు..
.