AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకొస్తారా? వీటి ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

GST Council Meet: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న వేళ... మే 28న జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత జరిగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై ఆసక్తి నెలకొంటోంది.

పెట్రోల్, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకొస్తారా? వీటి ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు
Petrol And Diesel
Janardhan Veluru
|

Updated on: May 25, 2021 | 3:39 PM

Share

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న వేళ… మే 28న జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత జరిగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలపై ఆసక్తి నెలకొంటోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్లతో పాటు కోవిడ్‌కు సంబంధించిన మెడిసిన్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ తదితర పరికరాలపై జీఎస్టీ తగ్గించడం లేదా పూర్తిగా మాఫీ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

దీంతో పాటు పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరగడంతో వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ చాలా రోజులుగానే వినిపిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వీటి ధరలు భారీగా తగ్గే అవకాశముందని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే విమానాలకు వాడే జెట్ ఫ్యూషల్, నేచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.

కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతంగా ఉండగా…దీన్ని తగ్గించడం లేదా మాఫీ చేసే యోచన ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీని యధాతథంగా కొనసాగించే అవకాశముంది. అలాగే కోవిడ్ మెడిసిన్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లపై ప్రస్తుత 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించొచ్చని సమాచారం. అలాగే మాస్కులు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్‌పై జీఎస్టీని తగ్గించే అవకాశంలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..  నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. చూస్తే వావ్ అనాల్సిందే..!

గవర్నమెంట్ టీచర్ దహనం కేసులో కొత్త మలుపు, భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆరోపణలు