AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli New Look: నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. చూస్తే వావ్ అనాల్సిందే..!

Virat Kohli New Look: భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే మాత్రమే సూపర్ స్టార్ కాదు.. స్టైలీష్ ఐకాన్ కూడా గుర్తింపు పొందాడు.

Virat Kohli New Look: నయా లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. చూస్తే వావ్ అనాల్సిందే..!
Viral Kohli New Look
Shiva Prajapati
|

Updated on: May 25, 2021 | 3:33 PM

Share

Virat Kohli New Look: భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే మాత్రమే సూపర్ స్టార్ కాదు.. స్టైలీష్ ఐకాన్ కూడా గుర్తింపు పొందాడు. చాలా మంది అభిమానులు విరాట్ కోహ్లీ గడ్డం, హెయిర్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కోహ్లీ హెయిర్ స్టైల్, గడ్డం స్టైల్‌‌కి అంతటి క్రేజ్ ఉంది మరి. ఇదిలాఉంటే.. తాజాగా విరాట్ కోహ్లీ భారీ గడ్డంతో ఉన్న న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగా ఇది విరాట్ కోహ్లీ నేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రముఖ వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’లో ప్రొఫెసర్‌తో పోల్చుతుండగా.. మరికొందరు. కబీర్ సింగ్ సినిమాలోని షాహిద్ కపూర్‌తో పోల్చుతున్నారు.

కరోనా వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 14 రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లీ తిరిగి హోమ్ టౌన్‌కు చేరుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న కోహ్లీ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులను పలకిస్తున్నాడు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో పేదవారిని ఆదుకోవడం కోసం నిధుల సేకరణకై విరాట్ కోహ్లీ దంపతులు ఇటీవల సోషల్ మీడియాలో పలుు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. నిర్ధేషించుకున్న లక్ష్యం మేరకు నిధులు సేకరించిన ఈ స్టార్ కపుల్.. అవసరమైన వారికి సాయం చేస్తూ వస్తున్నారు.

ఇదిలాఉండగా.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లనో ఉంటున్న విరాట్ కోహ్లీకి సంబంధించి తాజాగా పొడవాటి జుట్టు, భారీగా పెరిగిన గడ్డంతో ఉన్న కోహ్లీ ఫోటోను కొందరు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఇటీవలె అనుష్కతో కలిసి సోషల్ మీడియాలో కనిపించిన కోహ్లీ జుట్టు, గడ్డం కొద్దిగా మాత్రమే ఉంది. ఇంతలోనే అంత జుట్టు, గడ్డం ఎలా పెంచుకోగలిగాడని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోను కొందరు ‘మనీ హిస్టరీ’ వెబ్ సిరీస్‌లోని ప్రొఫెసర్‌తో పోల్చుతుండగా.. మరికొందరు కబీర్ సింగ్‌ పాత్రతో పోలుస్తున్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి ఇది నిజమేనా, అబద్ధమా? అని ఇన్వేస్టిగేషన్ చేసేశారు. ఈ ఫోటో కోహ్లీ, అనుష్క తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఏమైనా పోస్ట్ చేశారా? అని తెగ సెర్చ్ చేశారు. ఎంతకీ కనిపించకపోవడంతో ఈ ఫోటోను ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. ఏది ఏమైనా నయా లుక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఫోటో నెటిజన్లను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఆ ఫోటోను మీరూ చూసేయండి.

Also read:

karthi birthday: స‌హ‌జ న‌ట‌న‌.. క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం.. కార్తీ సొంతం. నేడు ఆయ‌న పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భంగా..

Government teacher Saraswati : గవర్నమెంట్ టీచర్ దహనం కేసులో కొత్త మలుపు, భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆరోపణలు