karthi birthday: స‌హ‌జ న‌ట‌న‌.. క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం.. కార్తీ సొంతం. నేడు ఆయ‌న పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భంగా..

karthi birthday Special: కార్తీ.. పేరుకు త‌మిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో చోటు సంపాదించుకున్నారు. త‌న‌దైన స‌హ‌జ‌న న‌ట‌న‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారీ హీరో...

karthi birthday: స‌హ‌జ న‌ట‌న‌.. క‌థ‌ల ఎంపిక‌లో వైవిధ్యం.. కార్తీ సొంతం. నేడు ఆయ‌న పుట్టిన రోజు.. ఈ సంద‌ర్భంగా..
Karthi Birthady
Follow us
Narender Vaitla

|

Updated on: May 25, 2021 | 3:25 PM

karthi birthday Special: కార్తీ.. పేరుకు త‌మిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో చోటు సంపాదించుకున్నారు. త‌న‌దైన స‌హ‌జ‌న న‌ట‌న‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారీ హీరో. పేరుకు సినీ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ హీరో. ఇదిలా ఉంటే నేడు (మంగ‌ళ‌వారం) కార్తీ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న సినిమా కెరీర్‌ గ్రాఫ్‌పై ఓ లుక్కేద్దామా.. మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర అసిస్ఎంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టిన కార్తీ.. సోద‌రుడు సూర్య హీరోగా న‌టించిన అయుత ఎఘుతు (తెలుగులో యువ‌) సినిమాతో వెండి తెరపై తొలిసారి క‌నిపించారు. ఇక తొలిసారి హీరోగా 2007లో వచ్చిన పరుత్తి వీరన్ చిత్రంలో న‌టించిన కార్తీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. రెండో చిత్రం యుగానికొక్క‌డులో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టించి అల‌రించారు. ఈ సినిమా ద్వారానే కార్తీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఇక ఆవారాతో మ‌రోసారి మెస్మ‌రైజ్ చేశారు. ఈ సినిమ‌లోని పాటలు ఇప్ప‌టికీ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటూనే ఉన్నాయి. అన‌తంరం నా పేరు శివ‌, శకుని వంటి చిత్రాల‌తో స‌హ‌జ న‌ట‌న‌కు కేరాఫ్‌గా మారారు కార్తీ. ఇక నాగార్జునతో ఊపిరి చిత్రంలో న‌టించిన తెలుగు వారికి మ‌రింత చేరువైన కార్తీ ఇక్క‌డ కూడా మంచి మార్కెట్‌ను ఏర్ప‌రుచుకున్నారు. అనంత‌రం ఖైదీ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక తాజాగా సుల్తాన్ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు కార్తీ. ఇక ఈ యంగ్ హీరో ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. కార్తీ ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని, మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటూ మ‌న‌మూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పేద్దామా..!

Also Read: Jagapathibabu: ఆనంద‌య్య నాటు మందుపై న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీల‌క వ్యాఖ్య‌లు..

ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. ‘విరాటపర్వం’ విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!