పోలీస్ ఇంటరాగేషన్ సందర్భంగా భోరున విలపించిన రెజ్లర్ సుశీల్ కుమార్, పొంతన లేని సమాధానాలతో ఖాకీలు బేజారు
యువ రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పోలీస్ లాకప్ లో భోరున విలపించినట్టు తెలిసింది.
యువ రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పోలీస్ లాకప్ లో భోరున విలపించినట్టు తెలిసింది. ఇంటరాగేషన్ సందర్భంగా అతడు చాలా నెర్వస్ గా ఫీలయ్యాడనీ, తమ ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. సుశీల్ తో బాటు ఇతని సహచరుడు అజయ్ కుమార్ ని వారు అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా సుశీల్ కుమార్ ని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. సాగర్ రానా హత్య అనంతరం పారిపోయిన సుశీల్ కుమార్ కి ఎవరెవరు సహకరించారన్న అంశంతో బాటు అన్ని కోణాలనుంచి ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు. 19 రోజులుగా ఇతడు పరారీలో ఉన్నాడు. మే 4 న ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద ఘర్షణ జరిగినప్పుడు తాను స్పాట్ లో ఉన్నానని, రెండు గ్రూపుల మధ్య రగడను నివారించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించానని సుశీల్ పోలీసులకు తెలిపాడు. అయితే సాగర్ రానాను, అతని సహచరుడు సోనూను తాను మోడల్ టౌన్ ఫ్లాట్ కి తీసుకురాలేదని చెప్పాడు. కానీ అతడు తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇతడ్ని ఖాకీలు మూడు ప్రదేశాలకు తిప్పారు. మొదట ఘర్షణ జరిగిన స్టేడియం వద్దకు, ఆ తరువాత సాగర్, సోనూలను ఇతడు తీసుకువచ్చినట్టు భావిస్తున్న మోడల్ టౌన్ ఫ్లాట్ వద్దకు, అనంతరం ఇతగాడు తరచూ విజిట్ చేసే షాలిమార్ బాగ్ వద్దకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ అన్ని చోట్లా వారు అడిగిన ప్రశ్నలకు సుశీల్ కుమార్ సమాధానాలు చెప్పలేకపోయాడని తెలుస్తోంది.
నిజానికి సుశీల్ కు చెందిన ఇంటిని లోగడ సాగర్ అద్దెకు తీసుకున్నాడని, అద్దె సరిగా చెల్లించకపోవడంతో రెట్టించి అడిగేసరికి సుశీల్ ని అందరి ఎదుట దుర్భాషలాడి అవమానపరచాడని ఆ కోపంతో సుశీల్ అతనిపై దాడి చేశాడని వార్తలు వచ్చ్చాయి/ ఈ దాడిలో గాయపడిన సాగర్ ఆసుపత్రిలో మరణించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ranked: ఈ రాశుల వారితో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే.!