AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Board Exams: విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టే ముందు ఆ పని చేయండి…. తెర‌పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చిన అఖిలేష్

Akilesh Tweet On Exams: క‌రోనా నేథ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డిచే సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తితో పాటు మ‌రికొన్ని పోటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే...

Board Exams: విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టే ముందు ఆ పని చేయండి.... తెర‌పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చిన అఖిలేష్
Akhiledh Yadav On Exams
Narender Vaitla
| Edited By: Janardhan Veluru|

Updated on: May 25, 2021 | 4:06 PM

Share

Akilesh Yadav On Board Exams: క‌రోనా నేథ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో న‌డిచే సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తితో పాటు మ‌రికొన్ని పోటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆదివారం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్య‌క్ష‌త‌న వ‌ర్చువ‌ల్ మీటింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో పాల్గొన్న ప‌లు రాష్ట్రాల‌కు చెందిన విద్యా శాఖ మంత్రులు, అధికారులు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. అయితే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తేదీపై ఇంకా స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం రాక‌పోయినప్ప‌టికీ వ‌చ్చే నెల చివ‌ర్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తార‌ని సూచ‌న ప్రాయంగా తెలిసింది.

ఇదిలా ఉంటే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటే ముందుగా విద్యార్థులకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ తెర‌పైకి కొత్త డిమాండ్‌ను తీసుకొచ్చారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యాక్సినేష‌న్ లేకుండా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ‌ద్దు (నో ఎగ్జామినేష‌న్ విత్ అవుట్ వ్యాక్సినేష‌న్) అనే ట్వీట్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఆదివారం జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్న‌స‌మాజ్‌వాదీ పార్టీ ఎమ్ఎల్‌సీ ఉద‌య్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మాడ‌కూడ‌దని తెలిపార‌ని స‌మాచారం. ఇక ఢిల్లీ, కేర‌ళ రాష్ట్రాల‌కు చెందిన అధికారులు కూడా ప‌రీక్ష‌ల కంటే ముందే వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌నే వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. ఇక వ‌ర్చువ‌ల్ మీటింగ్ జ‌రిగ‌న త‌ర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై.. జూన్ 1న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపారు.

అఖిలేష్ యాద‌వ్ చేసిన ట్వీట్‌..

Also Read:  TATA CONSULTANCY SERVCES : ఉద్యోగం కోసం వేచిచూస్తున్నారా..! అయితే TCS కోడ్‌విటా పోటీలో పాల్గొనండి.. జాబ్ సంపాదించండి..

CBSE TELE COUNSELLING : సీబీఎస్ఈ టెలికౌన్సెలింగ్ ప్రారంభం.. దోస్ట్ ఫర్ లైఫ్ మొబైల్ అప్లికేషన్‌లో లైవ్..

Telangana Open School: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కంటే..