Social Media: రేపటి నుంచి భారత్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పనిచేయవా..? అసలేం జరగనుంది..
Social Media: ప్రపంచచాన్ని సోషల్ మీడియా ఓ మలుపు తిప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా గతిని...
Social Media: ప్రపంచచాన్ని సోషల్ మీడియా ఓ మలుపు తిప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా గతిని మలుపు తిప్పాయి. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా సైట్లు నియమనిబంధలను పాటించడం లేదనే ఆరోపణలు ఇటీవల భారత్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వంకొత్త నియమావళిని రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న రూపొందించిన ఈ నియమావళిలోని మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా సమయం ఇచ్చింది. ఈ రూల్స్ మే 26 నుంచి అమల్లోకి రానున్నాయి.. అంటే ఈ గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది.
సోషల్ మీడియా సైట్లపై నిషేధం తప్పదా..?
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. అలాగే ఓటీటీ, డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం వెల్లడించాలని కేంద్రం గతంలో ఆదేశాలిచ్చింది. ఓటీటీ మాధ్యమాల్లో మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్పకపోయినా.. వాటి సమాచారాన్ని మాత్రం ఇవ్వాలని కేంద్రం చెప్పింది. కేంద్ర నియమావళి ప్రకారం.. అన్ని రకాల సామాజిక మాధ్యమాలు తమ తమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే.. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలని.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయడంతో పాటు 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని కేంద్రం తెలిపింది.
ఆ నిబంధనలను పాటిస్తోన్న ఏకైక సంస్థ `కూ`..
సోషల్ మీడియా సంస్థలు.. నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించాలని కూడా కేంద్రం నిబంధనల్లో పొందుపర్చింది. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలని…వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి సూచించింది. ఇలాంటి మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం విధించింది. కానీ.. ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందిన ఒక్క `కూ` సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదు. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమిచ్చినా చర్యలు చేపట్టలేదు. అయితే ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో.. ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Coronavirus India News: భారత సైన్యంలో జోరుగా వ్యాక్సినేషన్… పెద్దగా ప్రభావం చూపని కరోనా సెకండ్ వేవ్
Pocso Act: టవల్ కట్టుకుని విద్యార్థినులకు పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏం జరిగిందంటే..