Champions Trophy 2025: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. కారణమిదే
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కు సంబంధించి ఐసీసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్ వేదికగా జరుగనుంది. అయితే ఈ ఐసీసీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చేయగా.. హైబ్రిడ్ మోడల్‌కు అవకాశముందనే ప్రచారం సాగుతోంది. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ కూడా దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం (నవంబర్ 11) జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను రద్దు చేసింది. ‘ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్య దేశంతో పాటు ఈ టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో మేం మాట్లాడుతున్నాం. షెడ్యూల్‌పై పూర్తి క్లారిటీ వచ్చాక టోర్నీ గురించి అధికారికంగా వెల్లడిస్తాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ESPNcricinfo నివేదిక ప్రకారం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపలేమని BCCI ICCకి తెలిపింది. దీనికి గల కారణాన్ని బీసీసీఐ తెలియజేస్తూ.. భారత జట్టును పాకిస్థాన్‌కు పంపవద్దని భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు ఐసీసీకి తెలిపింది. అంటే టీమ్ ఇండియా ఇప్పట్లో పాకిస్థాన్ కు వెళ్లకపోవడం ఖాయం. అందువల్ల, హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం తప్ప పాకిస్తాన్‌కు వేరే మార్గం లేదు. ఈ హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ అంగీకరించకపోతే ఐసీసీతో పాటు పాకిస్థాన్ బోర్డు కూడా భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఎందుకంటే ఐసీసీ ఏ ఈవెంట్ నిర్వహించినా ప్రధాన ఆదాయ వనరు టీమ్ ఇండియానే. అందువల్ల టీమ్ ఇండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే ధైర్యం ఐసీసీకి లేదు. అందువల్ల ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించడం అనివార్యం.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
The BCCI informed the ICC that India will not travel to Pakistan for the 2025 Champions Trophy 🇮🇳🏏
The BCCI stated that it had been advised by the Indian government not to send the team to Pakistan 🇵🇰#India #ChampionsTrophy #ODIs #Sportskeeda pic.twitter.com/hBfjCLdva4
— Sportskeeda (@Sportskeeda) November 9, 2024
అయితే.. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ స్పందించాడు. దీంతో ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నవంబర్ 11న నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది.
India hasn’t visited Pakistan since the 2008 Asia Cup, and the 2025 Champions Trophy won’t change that ✈️
More details 👇 https://t.co/qvgeFoJSer
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..