SA vs IND: నేడు భారత్-దక్షిణాఫ్రికా రెండో టీ20.. ఆ యంగ్ ప్లేయర్‌కు ఆఖరి ఛాన్స్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్ననాలుగు మ్యాచుల టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే టీమిండియా మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం (నవంబర్ 10) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గెబహా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందడంతో ఈ మ్యాచ్‌లోనూ అదే జట్టును బరిలోకి దింపనుంది. అయితే టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కానీ రీప్లేస్ మెంట్ ఓపెనర్ జట్టులో లేకపోవడంతో అభిషేక్ కు మరో అవకాశం దక్కుతుందనడంలో సందేహం లేదు. దీని ప్రకారం రెండో మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు టీమిండియాకు స్టార్టర్లుగా బరిలోకి దిగనున్నారు. మూడో ఆర్డర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కనిపించనున్నాడు. అలాగే ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో, రింకూ సింగ్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నారు. అలాగే అక్షర్ పటేల్‌కు ఏడో నంబర్‌లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా అవకాశం లభించనుంది. జట్టులో బౌలర్లుగా అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ ఉన్నారు.
T20 మ్యాచ్ రిపోర్ట్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌లు గెలవగా, దక్షిణాఫ్రికా 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. దక్షిణాఫ్రికాలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో భారత్ 7 మ్యాచ్‌లు గెలుపొందగా, దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌లు గెలిచింది. రాత్రి 8.30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. కానీ రెండో మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది
Great start for the Men in Blue in the T20I series against the Proteas! A solid display of character from the young team in holding back a dangerous batting line-up in the chase. A special appreciation for @IamSanjuSamson for his second consecutive hundred in T20I’s, and the… pic.twitter.com/SqTWaRYqfh
— Jay Shah (@JayShah) November 9, 2024
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఈ కింది విధంగా ఉండనుంది.
- అభిషేక్ శర్మ
- సంజు శాంసన్ (వికెట్ కీపర్)
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
- తిలక్ వర్
- హార్దిక్ పాండ్యా
- రింకూ సింగ్
- అక్షర్ పటేల్
- అర్ష్ దీప్ సింగ్
- వరుణ్ చక్రవర్తి
- రవి బిష్ణోయ్
- అవేష్ ఖాన్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..