AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా.. ఆన్సర్ తెలిస్తే అవాక్కే..?

Ashwin Bowl Without Repeating a Variation: మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టే ఈ ఇద్దరు దిగ్గజ స్పిన్నర్లు, మైదానం వెలుపల తమ అనుభవాలను పంచుకున్న తీరు క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందించింది. క్రికెట్‌లో స్పిన్ ప్రాధాన్యత ఎంతటిదో మరోసారి నిరూపిస్తూనే, ఆటకు సంబంధించిన సరికొత్త కోణాలను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.

Video: ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా.. ఆన్సర్ తెలిస్తే అవాక్కే..?
Ashwin Bowl Variations
Venkata Chari
|

Updated on: Jul 24, 2026 | 4:12 PM

Share

Ashwin Bowl Without Repeating a Variation: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, పియూష్ చావ్లా ఒకే వేదికపైకి వచ్చి తమ కెరీర్‌లోని అనేక ఆసక్తికర రహస్యాలను పంచుకున్నారు. ఇంగ్లాండ్‌పై వికెట్ తీశాక బౌలింగ్ సీక్రెట్ బయటపెట్టినందుకు కోచ్ రవిశాస్త్రి తనపై గర్జించిన ఘట్టాన్ని అశ్విన్ గుర్తుచేసుకోగా, సచిన్‌ను అవుట్ చేసిన క్షణాలను చావ్లా వివరించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ అలిస్టర్ కుక్‌ను అశ్విన్ ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో తాను ఆ బంతిని ఎలా విసిరాడో, చేతి వేళ్ల మ్యాజిక్ ఎలా పనిచేసిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి రాగానే అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. “మన బౌలింగ్ రహస్యాలను ప్రత్యర్థులకు, మీడియాకు ఎందుకు అంత వివరంగా చెబుతున్నావ్?” అని గద్దించడంతో ఒక్కసారిగా భయపడిపోయానని అశ్విన్ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి తన వేరియేషన్ల గురించి బహిరంగంగా మాట్లాడటం తగ్గించానని చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఇవి కూడా చదవండి

సచిన్‌ను పెవిలియన్ పంపిన గూగ్లీ మ్యాజిక్..!

మరోవైపు టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా కూడా తన కెరీర్‌లోని ఓ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. ఛాలెంజర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేసిన సన్నివేశం తన జీవితాంతం గుర్తుండిపోతుందని తెలిపాడు. క్రీజులోకి రాగానే సచిన్ ధాటిగా ఆడటం మొదలుపెట్టారని, ఆ ఒత్తిడిలో తాను అనుకోకుండా క్రిప్ మార్చి గూగ్లీ వేశానని గుర్తు చేసుకున్నాడు. ఆ బంతికి సచిన్ బౌల్డ్ కావడంతో ఆనందంతో మైదానంలో పరుగులు తీశానని చావ్లా తెలిపాడు.

రిపీట్ చేయకుండా అశ్విన్ ఎన్ని బాల్స్ వేయగలడంటే?

ఈక్రమంలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు అశ్విన్ సమాధానమిస్తూ.. ఎనిమిది బంతులు వేయగలను అని చెప్పుకొచ్చాడు. అవేంటో ఓసారి చూద్దాం.. ఆఫ్ బ్రేక్, ఆర్మ్ బాల్, అండర్ కట్టర్, టాప్ స్పిన్, కారమ్ బాల్, రివర్స్ కారమ్ బాల్, లెగ్ బ్రేక్, ఫ్లిప్పర్ వేస్తానంటూ సమాధానమిచ్చాడు.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

ధోనీ కెప్టెన్సీ మార్క్.. అంకితభావానికి నిదర్శనం..!

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చాతుర్యం గురించి మాట్లాడుతూ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మైదానంలో ప్రతి బౌలర్ రికార్డులపై ధోనీకి పూర్తి అవగాహన ఉండేదని అన్నాడు. మ్యాచ్‌లో ఏదైనా బౌలర్ నాలుగు వికెట్లు తీస్తే, ఐదో వికెట్ మైలురాయి సాధించేందుకు వీలుగా టెయిలెండర్ల సమయంలో వారికే బౌలింగ్ ఇచ్చేవాడని తెలిపాడు. ఒకసారి ముంబైలో తాను నాలుగు వికెట్లతో ఉన్నప్పుడు వేరే బౌలర్‌కు బంతి ఇచ్చి, మ్యాచ్ ముగిశాక స్వయంగా వచ్చి సారీ చెప్పిన సందర్భాన్ని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు.

బ్యాటర్లకు ఒక న్యాయం.. బౌలర్లకు మరొకటా..?

ఆధునిక క్రికెట్‌లో బ్యాటర్లకు లభిస్తున్న సడలింపులపై ఇద్దరు స్పిన్నర్లు సరదాగా అసహనం వ్యక్తం చేశారు. బ్యాటర్లు క్రీజు వదిలి ముందుకు రావడం, స్విచ్ షాట్లు ఆడటానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, కానీ బౌలర్ లైన్ దాటి ఒక్క మిల్లీమీటర్ ముందడుగు వేసినా నో-బాల్‌గా ప్రకటిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టెస్టుల్లో నిమిషాల వ్యవధిలోనే ఓవర్లు పూర్తి చేసే బౌలర్ల కంటే బ్యాటర్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని, భవిష్యత్తులో బౌలర్లకు కూడా తమ యాక్షన్ లేదా వేరియేషన్‌ను ముందే చెప్పకుండా మార్చే వెసులుబాటు ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు
తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి అదిరిపోయే గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి అదిరిపోయే గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా