AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit: అబ్బబ్బా.. క్రేజీ జోడి భయ్యా.. ప్రభాస్ సరసన ఆ స్టార్ హీరోయిన్.. స్పిరిట్ మూవీలో కీలకపాత్ర.. ?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఇదివరకే త్రిప్తి డిమ్రి నటిస్తుండగా.. మరో స్టార్ హీరోయిన్ సైతం భాగం కానుందట. ఇంతకీ ఆమె ఎవరు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Rajitha Chanti
|

Updated on: Jul 24, 2026 | 2:33 PM

Share
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit). కాంబినేషన్ ప్రకటన నుంచే ఈ సినిమాపై సినీ ప్రియుల్లోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

1 / 5
ఇప్పటికే ఈ చిత్రంలో కథానాయికగా 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే కత్రినా కైఫ్‌ను సెకండ్ హీరోయిన్‌గా కాకుండా, కథలో అత్యంత ప్రాధాన్యత ఉన్న, కథను మలుపు తిప్పే ఒక విశిష్టమైన పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. ఒకవేళ ఇది నిజమైతే, వెండితెరపై ప్రభాస్ - కత్రినా కాంబినేషన్ అభిమానులకు అసలైన విజువల్ ఫీస్ట్‌గా మారనుంది. కత్రినా కైఫ్‌కు తెలుగు పరిశ్రమతో పాత అనుబంధమే ఉంది. గతంలో ఆమె విక్టరీ వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి', నందమూరి బాలకృష్ణ సరసన 'అల్లరి పిడుగు' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

2 / 5
ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైన కత్రినా, చాలా కాలం తర్వాత మళ్లీ ఒక భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, 'స్పిరిట్' షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయిందని వెల్లడించారు. ఇందులో ప్రభాస్ ఐపీఎస్ (IPS) ఆఫీసర్‌గా, మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ ఫుల్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. టి-సిరీస్ (T-Series) , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

3 / 5
మిగిలిన చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి, 2027 మార్చిలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ చేరికపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మరిన్ని రెట్లు పెరగడం ఖాయం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ టఫ్, పవర్ ఫుల్ ఐపీఎస్ (IPS) ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

4 / 5
ఇందులో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కత్రినా కైఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ..  ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. వీటితో పాటు భారతీయ సినీ రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కల్కి 2' ,  'సలార్ పార్ట్-2 (శౌర్యాంగ పర్వం)' చిత్రీకరణల్లో కూడా పాల్గొననున్నారు.

5 / 5
Follow Us