AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు.. కట్‌చేస్తే.. 2వ మ్యాచ్‌ నుంచి నయా సెన్సెషన్ ఔట్..?

IND vs ZIM T20: తొలి మ్యాచ్ విజయం జోష్ ఇచ్చినప్పటికీ ఆ ముగ్గురి లోపాలను మేనేజ్‌మెంట్ త్వరగా సరిదిద్దుకోవాల్సి ఉంది. తదుపరి జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో ఏమైనా మార్పులు చేసి అశోక్ శర్మ స్థానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశం ఇస్తారేమో వేచి చూడాలి.

తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు.. కట్‌చేస్తే.. 2వ మ్యాచ్‌ నుంచి నయా సెన్సెషన్ ఔట్..?
Ind Vs Zim 2nd T20i Playing Xi
Venkata Chari
|

Updated on: Jul 24, 2026 | 4:33 PM

Share

Shreyas Iyer: జింబాబ్వే పర్యటనలో భారత కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20 పోరులో జింబాబ్వేను ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. అయితే, మ్యాచ్ గెలిచినా జట్టు ప్రదర్శనలో మూడు కీలక లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

హరారేలో ఘన విజయం.. కెప్టెన్‌గా శ్రేయస్‌కు ఊరట..!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే అత్యంత సునాయాసంగా ఛేదించింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి వీరవిహారం చేయగా, ఇషాన్ కిషన్ 35 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో తమవంతు పాత్ర పోషించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. దీనితో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఇవి కూడా చదవండి

ఫామ్ కోల్పోయి తడబడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ..!

జట్టు గెలిచినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. తొలి రెండు బంతుల్లోనే బౌండరీలతో విరుచుకుపడే సత్తా ఉన్న అభిషేక్, ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ సిరీస్‌ నుంచి వస్తున్న అతని ఫామ్‌లేమి ఇక్కడ కూడా కొనసాగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే భారత ఇన్నింగ్స్ కష్టాల్లో పడేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

బౌలింగ్‌లో ఆ ఇద్దరి భారీ మూల్యం.. ఆలోచనలో మేనేజ్‌మెంట్..!

మరోవైపు టీమిండియా బౌలింగ్ విభాగంలోనూ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. డెబ్యూ మ్యాచ్ ఆడిన యువ బౌలర్ అశోక్ శర్మ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన శివం దూబే ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మారడంతో బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించిన దూబే, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 8 ఎకనామీతో ఏకంగా 32 పరుగులు ఇచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. ఇతడిని ప్రాథమిక ఆల్‌రౌండర్‌గా కంటే పార్ట్‌టైమ్ బౌలర్‌గా వాడితేనే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు
తొలి గెలుపు దక్కినా, తలనొప్పిలా మారిన ఆ 3 లోపాలు
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు
మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు వీరే
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఒడిలో మహిళతో ఆటో నడిపిన మైనర్ బాలుడు.. మరోసారి రచ్చ రచ్చ! అసలేంటి
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి అదిరిపోయే గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఏపీకి అదిరిపోయే గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!