AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు పెంచాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. కలెక్టర్ స్పందన చూస్తే షాక్ అవుతారు!

ఒకప్పుడు పాఠశాలల్లో జుట్టు పొడవుగా ఉంటే ఉపాధ్యాయులు మందలించడం లేదా కత్తిరించుకుని రమ్మని హెచ్చరించడం చూస్తుండేవాళ్లం. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఒక ప్రముఖ కేంద్రీయ విద్యాలయంలో (KV) పొడవాటి జుట్టు పెంచాడనే కారణంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థికి బదిలీ ధృవీకరణ పత్రం (TC) ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Kanpur Collector Grievance Cell
Balaraju Goud
|

Updated on: Jul 24, 2026 | 6:09 PM

Share

ఒకప్పుడు పాఠశాలల్లో జుట్టు పొడవుగా ఉంటే ఉపాధ్యాయులు మందలించడం లేదా కత్తిరించుకుని రమ్మని హెచ్చరించడం చూస్తుండేవాళ్లం. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఒక ప్రముఖ కేంద్రీయ విద్యాలయంలో (KV) పొడవాటి జుట్టు పెంచాడనే కారణంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థికి బదిలీ ధృవీకరణ పత్రం (TC) ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ తన కుమారుడితో కలిసి శుక్రవారం (జూలై 24) జిల్లా మేజిస్ట్రేట్ (DM) జితేంద్ర ప్రతాప్ సింగ్ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు వచ్చింది. అతని నానమ్మ మరణించడంతో 20 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నామని, ఆ తర్వాత కొడుకును లీవ్ లెటర్‌తో పాఠశాలకు తీసుకెళ్తే.. తరగతిలోకి రానివ్వకుండా చేతికి టీసీ ఇచ్చారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని తిరిగి పాఠశాలలో చేర్చుకునేలా న్యాయం చేయాలని వేడుకుంది.

స్కూల్ యాజమాన్యం చెప్పిన 20 రోజుల లీవ్ కారణంపై డిఎం జితేంద్ర ప్రతాప్ సింగ్‌కు అనుమానం వచ్చి, ఆ విద్యార్థిని ఆప్యాయంగా ప్రశ్నించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థికి పొడవాటి జుట్టు పెంచడమంటే తీవ్రమైన ఇష్టం. అయితే క్రమశిక్షణ పాటించాలని, జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ యాజమాన్యం పదేపదే హెచ్చరించినప్పటికీ అతడు వినలేదు. చివరికి ఆ విద్యార్థి ప్రవర్తనను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి పాఠశాల అతడిని బహిష్కరిస్తూ టీసీ ఇచ్చింది.

ఈ కారణం విని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. “ఇది చదువుకుని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసు. పాఠశాలకు వెళ్లేది క్రమశిక్షణతో విద్యను అభ్యసించడానికే తప్ప, పొడవాటి జుట్టుతో ఫ్యాషన్లు చేయడానికి కాదు” అని హితవు పలికారు. ఇలాంటి తప్పు మళ్లీ జరగదని, తామే స్వయంగా కుమారుడి జుట్టును పొట్టిగా కత్తిరిస్తామని ఆ విద్యార్థి కుటుంబం జిల్లా మేజిస్ట్రేట్‌కు హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతడిని మళ్లీ స్కూల్‌లో చేర్చుకునేలా యాజమాన్యంతో మాట్లాడతానని డిఎం జితేంద్ర ప్రతాప్ సింగ్ వారికి అభయమిచ్చారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర