AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. 13 మంది మృతి.. పూర్తిగా ధ్వంసమైన వాహనం

Landslide Car Accident ప్రమాదానికి గురైన టాటా సుమో (HP-01M-2210) వాహనంలో డ్రైవర్‌తో సహా 15 మంది ప్రయాణిస్తున్నారు. బీర్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడు. కధునాలా ప్రాంతంలోని రాహౌలి సమీపిస్తుండగా, కొండపై నుండి అకస్మాత్తుగా ఒక పెద్ద బండరాయి పడి నేరుగా..

ఘోర ప్రమాదం.. 13 మంది మృతి.. పూర్తిగా ధ్వంసమైన వాహనం
Accident
Subhash Goud
|

Updated on: Jul 24, 2026 | 4:42 PM

Share

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా అయిన లాహౌల్ స్పితిలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఆర్ఓ (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) ప్రధాన రహదారిపై కధూనాలా-రహౌలి సమీపంలో కొండ నుంచి అకస్మాత్తుగా కొండచరియ విరిగిపడిన భారీ బండరాయి టాటా సుమో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ఉన్న 13 మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొండచరియ విరిగిపడటంతో బండరాయిలో పెద్ద భాగం కిందపడిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

ఉదయ్‌పూర్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో 13 మంది మరణించినట్లు భర్మౌర్-పాంగి ఎమ్మెల్యే జనక్ రాజ్ తెలిపారు. మృతులలో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.

ప్రమాదానికి గురైన టాటా సుమో (HP-01M-2210) వాహనంలో డ్రైవర్‌తో సహా 15 మంది ప్రయాణిస్తున్నారు. బీర్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడు. కధునాలా ప్రాంతంలోని రాహౌలి సమీపిస్తుండగా, కొండపై నుండి అకస్మాత్తుగా ఒక పెద్ద బండరాయి పడి నేరుగా వాహనంపై పడింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, ప్రయాణికులలో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. పడిన బండరాయి దెబ్బకు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని తరలించి ఆసుపత్రికి పంపించారు. మృతులను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని వారు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us