ట్రెండ్ సెట్ చేస్తున్న టాలీవుడ్ సీనియర్స్
టాలీవుడ్ సీనియర్ హీరోలు రొటీన్ మాస్ ఫార్ములాకు గుడ్‌బై చెప్పి కొత్త ట్రీట్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ యంగ్ డైరెక్టర్లతో కలిసి ట్రెండీ లుక్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో సినిమాలు చేస్తున్నారు. ‘కాకా’, ‘దాదా’, ‘కింగ్ 100’, ‘ఆదర్శ కుటుంబం’ టీజర్లతో అంచనాలు పెరిగాయి. పండుగ సీజన్లను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్లు కూడా ప్రకటించడంతో సీనియర్ హీరోల సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది.
కమర్షియల్ కథలే అయినా సరికొత్త ట్రీట్‌మెంట్ ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని టాలీవుడ్ సీనియర్ హీరోలు డిసైడ్ అయ్యారు. యంగ్ జనరేషన్ డైరెక్టర్స్‌తో ప్రయోగాలు చేస్తూనే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటి వరకు రొటీన్ మాస్ ఫార్ములాతో వెళ్లిన సీనియర్ హీరోలు ఇప్పుడు రూటు మార్చారు. తమ వయసుకు తగ్గట్టుగానే ట్రెండీగా కనిపిస్తూ, సరికొత్త బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరూ ఒకే దారిలో నడుస్తూ స్టైలిష్ వర్క్‌తో తమ సినిమాలను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. యంగ్ డైరెక్టర్ల క్రియేటివ్ టేకింగ్ వీరికి బాగా ప్లస్ అవుతోంది. రీసెంట్‌గా ఈ నలుగురు హీరోల నుంచి వచ్చిన టీజర్లు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’, బాలయ్య ‘దాదా’, నాగ్ ‘కింగ్ 100’, వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త డైరెక్టర్ల మోడర్న్ ప్రజెంటేషన్, నేటి తరం మ్యూజిక్ డైరెక్టర్ల బీజీఎమ్ మ్యాజిక్ ప్రతి సీన్‌ను హైలైట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ‘కాకా’, ‘దాదా’ టీజర్లలోని క్రియేటివ్ మేకింగ్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో విజిళ్లు వేయించడం ఖాయం అనిపిస్తోంది. పండుగ సీజన్లని టార్గెట్ చేస్తూ మేకర్స్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2న వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ కానుంది, డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’, నాగ్ ‘కింగ్ 100’ బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నాయి. ఇక మెగాస్టార్ ‘కాకా’ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. రొటీన్ మూస ధోరణికి గుడ్‌బై చెప్పి నయా జోనర్స్ టచ్ చేస్తున్న మన సీనియర్స్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు!
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

