AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

Phani CH
|

Updated on: Sep 15, 2026 | 9:23 PM

Share

కమర్షియల్‌ సినిమాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్న స్టార్‌ హీరోయిన్లు ఇప్పుడు బయోపిక్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. రష్మిక మందన్నా ఇప్పటికే ‘ఛావా’లో యేసుబాయి పాత్రలో మెప్పించగా, ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్‌. ‘అమరన్‌’లో ఇందు పాత్రలో ఆకట్టుకున్న సాయి పల్లవి, మధుబాల బయోపిక్‌లోనూ కనిపించనున్నారనే ప్రచారం ఉంది. కియారా మీనా కుమారి పాత్రకు, శ్రద్ధా కపూర్‌ విఠాబాయి పాత్రకు ఎంపికయ్యారని కథనం చెబుతోంది.

కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ డాల్స్‌గా మెప్పించిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు పూర్తిగా రూట్ మారుస్తున్నారు. ఆడియన్స్‌ను కేవలం అందంతోనే కాకుండా యాక్టింగ్‌తోనూ కట్టిపడేసేందుకు బయోపిక్స్‌ లైన్‌లో పడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్రేజీ బ్యూటీస్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లో నటించేందుకు రెడీ అవుతుండటం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు.. ఇప్పుడు బయోపిక్స్‌ మీద కన్నేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ఛావాలో యేసుబాయి పాత్రలో మెప్పించారు. అదే జోరులో లెజెండరీ సింగర్‌ ఎంఎస్‌ సుబ్బలక్ష్మీ బయోపిక్‌లోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. అమరన్ సినిమాలో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌లో కనిపించారు సాయి పల్లవి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో మెప్పించారు. సంజయ్‌ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న మధుబాల బయోపిక్‌లోనూ సాయి పల్లవి నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఎంఎస్ ధోని, షేర్షా లాంటి రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీస్‌లో మెప్పించిన కియారా.. మీనా కుమారి బయోపిక్‌లో నటించే ప్లాన్‌లో ఉన్నారు. గతంలో హసీనా పార్కర్ లాంటి బయోపిక్స్‌లో బోల్డ్ అటెంప్ట్ చేశారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. ఆ అనుభవంతోనే స్టేజ్ ఆర్టిస్ట్‌ విఠాభాయి పాత్రలో నటించారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే, మరోవైపు నటనకు స్కోప్ ఉన్న ఇలాంటి బయోపిక్స్ చేస్తూ కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు టాప్‌ బ్యూటీస్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?

USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌

Follow Us