హైదరాబాద్ బేగంబజార్‌లోని ఫీల్ ఖానాలో కొలువైన 48 కిలోల బంగారు గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో, మూడు లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్‌తో అన్నదమ్ములు అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నికితేష్ అగర్వాల్ ఏర్పాటు చేశారు. వినాయక చవితికి ఇది మరో హైలైట్.