వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. 15వసారి పట్టు వస్త్రాలు సమర్పించిన CM చంద్రబాబు
దేశం, రాష్ట్రం సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఏం తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి లో ముందుండేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
