AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన రామాయణ టీమ్

Ramayana: మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన రామాయణ టీమ్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 10:07 PM

Share

నితేష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ పార్ట్‌ 1’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ విజువల్‌ ఎపిక్‌ నుంచి ‘జై జై రామ్‌’ పాట విడుదలైంది. అరణ్యవాసంలోని సీతారాముల భావోద్వేగ క్షణాలను పాటలో అందంగా చూపించారు. ఏఆర్‌ రెహమాన్‌, హన్స్‌ జిమ్మర్‌ సంగీతం, అరిజిత్‌ సింగ్‌, శ్రేయా ఘోషల్‌ గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణ వచ్చింది. భారీ VFXతో సినిమా తెరకెక్కుతోంది.

ఇండియన్ స్క్రీన్ మీద రామాయణం నేపథ్యంతో ఎన్నో సినిమాలు వచ్చినా.. ఆ ఎపిక్ స్టోరీని నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్‌గా ప్రెజెంట్ చేస్తున్న సినిమా ‘రామాయణ పార్ట్ 1’. నితేష్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా మ్యూజికల్ జర్నీని మొదలుపెడుతూ ‘జై జై రామ్’ సాంగ్ రిలీజ్‌తో సినిమా మీద బజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న విజువల్ వండర్ రామాయణ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్‌.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. గణేష్ చతుర్థి సందర్భంగా ‘సియా రామ్’ పోస్టర్‌ను, ‘జై జై రామ్’ అనే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ సాంగ్ విజువల్స్, పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పటి ఎమోషనల్ మోమెంట్‌ను ఈ సాంగ్‌లో చూపించారు. ఒక చెట్టు కింద బండరాతిపై కూర్చున్న సీతమ్మ జడలో రాముడు ప్రేమగా పూలు పెడుతున్న సీన్ సినిమా స్కేల్‌ను, అందులోని విజువల్ బ్యూటీని హైలైట్ చేస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ బిల్డింగ్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసేలా మేకర్స్ ఈ సినిమాను డిజైన్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, ఇంటర్నేషనల్ లెజెండ్ హన్స్ జిమ్మర్ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. డాక్టర్ కుమార్ విశ్వాస్ రాసిన ‘జై జై రామ్’ పాటకు, మ్యూజిక్ సెన్సేషన్స్ అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ప్రాణం పోశారు. ఈ అద్భుతమైన కాంబో ఆడియన్స్‌కు ఒక డివొషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడమే కాదు సినిమా మీద ఉన్న హైప్‌ను మరింత పెంచేసింది. రామాయణ పార్ట్ 1 రిలీజ్ స్ట్రాటజీ కూడా హాలీవుడ్ సినిమాలను తలపిస్తోంది. సోనీ పిక్చర్స్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 5న ఆస్ట్రేలియాలో ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత నవంబర్ 6న వరల్డ్ వైడ్‌గా, నవంబర్ 8, 2026 న దీపావళి కానుకగా ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ లాంటి భారీ స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఈ విజువల్ ఎపిక్.. బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో మైథలాజికల్‌ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్‌ హీరోలు!

గ్లామర్‌ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్‌ హీరోయిన్ల కొత్త రూట్‌!

Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్‌ ధర ఎంతంటే!

పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?

USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు బ్రేక్‌

Follow Us