AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక అన్నదాన బోజనాల్లో బెండకాయ ఫ్రై ను ఇలా చేస్తే రుచి అదిరిపోతోంది

పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో మనం ఎక్కువగా ఇష్టపడే బెండకాయ ఫ్రైని ఇంట్లోనే అదే రుచితో, అంతే కరకరలాడుతూ తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ అన్నం, చపాతీ, పులావ్‌లకు అద్భుతమైన కాంబినేషన్‌గా ఉంటుంది.బియ్యప్పిండి, శనగపిండి, మసాలాలు కలిపి చేసే ఈ వంటకం పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ అందిస్తుంది. పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేయించి చేర్చడం దీని ప్రత్యేకత.

Prasanna Yadla
|

Updated on: Sep 16, 2026 | 6:00 AM

Share
ముందుగా  బెండకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. బెండకాయలో తడి ఉంటే అవి జిగురుగా మారతాయి. బెండకాయలను మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పావు కప్పు బియ్యప్పిండి (బెండకాయలు కరకరలాడటానికి ఇది చాలా ముఖ్యం), పావు కప్పు శనగపిండి, రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి.

1 / 5
ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ ఆమ్‌చూర్ పొడి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఫంక్షన్ స్టైల్ రంగు కోసం, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ చేర్చవచ్చు.

2 / 5

ఈ పొడి మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లను చల్లుకుంటూ బెండకాయ ముక్కలకు పిండి బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. ముక్కలకు పిండి లైట్‌గా కోటింగ్ అయ్యేలా చూసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్‌పై పెట్టి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మధ్యస్థంగా ఉంచాలి.

3 / 5
ఒక గరిటెలో పావు కప్పు వేరుశనగ గుళ్లను తీసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10-12 జీడిపప్పును  కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. అదే నూనెలో నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలను, రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసి బాగా వేయించి తీయాలి. వేయించిన పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేడిగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు బాగా పట్టి రుచి మెరుగుపడుతుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
 ఇప్పుడు అదే వేడి నూనెలో మసాలా పట్టించిన బెండకాయ ముక్కలను విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకుండా కొద్దికొద్దిగా వేస్తూ, మీడియం ఫ్లేమ్‌లో కరకరలాడే వరకు, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి క్రిస్పీగా వేగాక నూనె నుండి తీసి వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన బెండకాయలను కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించిన బెండకాయలను ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చేయాలి. అంతే, కరకరలాడే  బెండకాయ ఫ్రై సిద్ధం.

5 / 5
Follow Us