రంగారెడ్డి జిల్లా పీర్జాపూర్లో గ్రామస్థుల మధ్య ప్రతిష్టాపన స్థలంపై తలెత్తిన వివాదం కారణంగా ఒక గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే చెరువులో నిమజ్జనం చేశారు. పోలీసుల జోక్యం తర్వాత కూడా వివాదం సద్దుమణగకపోవడంతో, ఒక వర్గం వారు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా కలచివేసింది.