AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs SL: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో బ్రూక్ విధ్వంసం.. శ్రీలంకను 119 పరుగులతో చిత్తు చేసిన ఇంగ్లాండ్

ENG vs SL: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. జోస్ బట్లర్ 80 పరుగులతో చెలరేగగా, కెప్టెన్ హరి బ్రూక్ 42 బంతుల్లో సెంచరీతో 114 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 254 పరుగులు చేయగా, శ్రీలంక 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ENG vs SL: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో బ్రూక్ విధ్వంసం.. శ్రీలంకను 119 పరుగులతో చిత్తు చేసిన ఇంగ్లాండ్
Harry Brook
Rakesh
|

Updated on: Sep 16, 2026 | 8:13 AM

Share

ENG vs SL: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు తన బాదుడు ఏంటో మరోసారి చూపించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించి, ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి 119 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సీనియర్ అయిన జోస్ బట్లర్ కేవలం 44 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులో కాలుపెట్టినప్పటి నుంచి శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్, ఆ తర్వాత మరింత వేగంగా ఆడుతూ మరో 22 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు.

హ్యారీ బ్రూక్ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లాండ్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఫిల్ సాల్ట్ (39 బంతులు) పేరిట ఉంది. నాటౌట్‌గా నిలిచిన బ్రూక్ 49 బంతుల్లోనే ఏకంగా 19 ఫోర్లు, 6 సిక్సర్లతో 114 పరుగులు బాదాడు. బట్లర్, బ్రూక్‌ల విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల రికార్డు స్థాయి స్కోరును నమోదు చేసింది. 2026 సంవత్సరంలో టీ20ల్లో నమోదైన ఐదో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Nitish Kumar Reddy: నితీష్ అద్భుత ప్రదర్శన.. ఒకే ఒక్క మ్యాచుతో విమర్శకుల నోళ్లు మూయించిన తెలుగోడు

భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే గట్టి షాకులు తగిలాయి. ఇంగ్లాండ్ పేసర్ సోనీ బేకర్ శ్రీలంక టాప్ ఆర్డర్‌ను పూర్తిగా కుప్పకూల్చాడు. స్కోరు బోర్డుపై సరైన పరుగులు లేని దశలోనే శ్రీలంక వికెట్లు కోల్పోయింది. కేవలం 69 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోగా, 97 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత చివర్లో వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కొద్దిగా పోరాడి 38 పరుగులు జోడించినప్పటికీ, శ్రీలంక ఇన్నింగ్స్ 135 పరుగులకే ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కనీసం తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: Sanju Samson: సిక్సర్లు, ఫోర్ల వర్షం.. ఛీ కొట్టిన వాళ్లకు బ్యాట్ తోనే సమాధానం చెప్పిన సంజూ

ఐసీసీ పూర్తి సభ్య దేశాలతో పోలిస్తే, 2026 సంవత్సరంలో పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. ఈ ఏడాది అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రికార్డు కూడా ఇంగ్లాండే కలిగి ఉంది. గతేడాది జూలైలో భారత్‌పై 125 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్, ఇప్పుడు శ్రీలంకపై 119 పరుగుల తేడాతో గెలిచి మరోసారి తన సత్తా చాటింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us