Shah Rukh Khan: అట్లీతో స్ట్రయిట్ తమిళ సినిమా, ప్రశాంత్ నీల్‌తో యాక్షన్ మూవీ ప్లాన్
‘జవాన్’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అట్లీతో షారుఖ్ ఖాన్ మరోసారి సినిమా చేయనున్నారనే ప్రచారం వైరల్‌గా మారింది. ప్రస్తుతం అట్లీ, అల్లు అర్జున్ ‘రాకా’పై పనిచేస్తుండగా, ఇందులో షారుఖ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే టాక్ ఉంది. ‘కింగ్’తో బిజీగా ఉన్న షారుఖ్.. అట్లీతో కోలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రశాంత్ నీల్‌తోనూ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
పఠాన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన షారూక్ ఖాన్‌ను ఆ వెంటనే ‘జవాన్’ సినిమాతో అదిరిపోయే హిట్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లోనే అట్లీతో మరో మూవీ ఉంటుందని చెప్పారు షారూఖ్. త్వరలోనే ఆ ప్రామిస్ నెరవేర్చబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోసారి ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు రానుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు డల్ గా ఉన్న టైమ్‌లో వచ్చి ఆ రికార్డులను తిరగరాసిన సినిమా ‘జవాన్’. డైరెక్టర్ అట్లీ మేకింగ్, షారుఖ్ యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా భారీ సక్సెస్ కావటంతో వీళ్ళ కాంబోలో ‘జవాన్ 2’ కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. జవాన్ 2 అప్‌డేట్ లేకపోయినా మరో క్రేజీ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ప్రజెంట్ అల్లు అర్జున్ హీరోగా ‘రాకా’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు అట్లీ. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక పవర్ ఫుల్ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు షారుఖ్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘కింగ్’ పనుల్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకొనేలతో కలిసి నటిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. నెక్ట్స్ సౌత్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన కింగ్ ఖాన్.. ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అట్లీని ఓ పవర్ ఫుల్ కథ రెడీ చేయమని స్వయంగా అడిగారట. గతంలో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో లుంగీ డ్యాన్స్ చేసి సౌత్ ఆడియన్స్‌కు దగ్గరైన షారుఖ్.. ఇప్పుడు నేరుగా తమిళ ఇండస్ట్రీలోనే అడుగుపెట్టాలని స్కెచ్ వేస్తున్నారు. ‘రాకా’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కేవలం అట్లీతోనే కాదు.. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా షారుఖ్ వరుస చర్చలు జరుపుతున్నారు. సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓ నిర్మాణ సంస్థతో కలిసి భారీ బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవైపు అట్లీతో కోలీవుడ్ ఎంట్రీ.. మరోవైపు ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ ఫిల్మ్.. ఇలా సౌత్ డైరెక్టర్లతో షారుఖ్ లైనప్ చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి బాద్‌షా రికార్డుల వేట మొదలైనట్టే కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో మైథలాజికల్ జాతర.. దేవుళ్ల కథల్లో స్టార్ హీరోలు!
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

