AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ 10’ రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10 రెండో వారం మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ సరికొత్తగా జరిగింది. దీంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ మరింత వేడెక్కింది. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ 10' రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 16, 2026 | 8:30 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం ఎలిమినేషన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒకరు కాదు ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం.. అది కూడా ఓటింగ్‌ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ అవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ పై తెగ విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో వారంలో ఎవ్వరు ఎలిమినేట్ అవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. షాలినీ పటేల్, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నారు. అమన్, వంశీ, నరేష్‌లు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ఉత్కంఠ ఓటింగ్ ట్రెండ్స్ పైనే ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ పరిశీలిస్తే.. త్రిగుణ్‌ టాప్ లో దూసుకెళుతున్నాడు. ముఖ్యంగా మొదటి వారంలో తనకు పోటీగా టాప్ లో నిలిచిన రోహిత్ ను ఇప్పుడు త్రిగుణ్ వెనక్కునెట్టేశాడు. ఇక రెండో స్థానంలో ఉన్న రోహిత్ కు, త్రిగుణ్ ల మధ్య ఓటింగ్ శాతం మధ్య కేవలం 1శాతం మాత్రమే తేడా. ఈ పరిస్థితి ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. రోహిత్‌ ఓట్లు పెరిగితే.. త్రిగుణ్‌ను వెనక్కి నెట్టి మళ్లీ నంబర్‌ 1 స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్‌ ఉంది

ఇక ఓటింగ్ ట్రెండ్స్ లో సీరియల్ నటుడు ముఖేష్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ నాలుగో ప్లేసులో ఉన్నాడు. ముఖ్యంగా బయటి నుంచి రామ్ ప్రసాద్ కు ఎక్కువగా సపోర్ట్ ఉంటోంది. ఇక ఐదో ర్యాంక్ లో సుధీర్, ఆరో ప్లేసులో షాలినీ, ఏడో స్థానంలో దేబ్జానీ, ఆ తర్వాత స్థానాల్లో సృష్టి, ఝాన్సీ, వర్షిణి , కృష్ణుడు ఉన్నారు. అంటే ప్రస్తుతం వర్షిణీ, కృష్ణుడు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. వీరిద్దరి మధ్య ఓటింగ్ శాతం తేడా కూడా చాలా తక్కువే. కాగా ఓటింగ్ కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఈ ఓటింగ్ ట్రెండ్స్ ఎప్పుడైనా మారొచ్చు. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం వర్షిణీ, కృష్ణుడులలో ఎవరో ఒకరు పెట్టే సర్దుకోవాల్సిందే. ప్రస్తుతానికి అయితే కృష్ణుడే పూర్తిగా డేంజర్ జోన్ లో ఉన్నాడని, ఈ వారం అతనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కిడ్నీలపై ఒత్తిడి పెంచే ఈ 4 ఆహారాలు ఏవో తెలుసా?
కిడ్నీలపై ఒత్తిడి పెంచే ఈ 4 ఆహారాలు ఏవో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!