IND Vs NZ: వరుసగా రెండో ఓటమి.. డబ్ల్యూటీసీలో మారిన టీమిండియా లెక్కలు.. ఫైనల్‌కి వెళ్లాలంటే

టెస్టుల్లో సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత్‌కు కివీస్ షాక్ ఇచ్చింది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ టీం 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్‌తోనే స్వదేశంలో విజయాలు సాధించిన టీమిండియా.. అదే స్పిన్ ఉచ్చులో పడి ఘోర ఓటమిపాలైంది.  

IND Vs NZ: వరుసగా రెండో ఓటమి.. డబ్ల్యూటీసీలో మారిన టీమిండియా లెక్కలు.. ఫైనల్‌కి వెళ్లాలంటే
Ind
Follow us

|

Updated on: Oct 26, 2024 | 5:25 PM

స్వదేశంలో భారత్‌తో టెస్ట్ సిరీస్ అంటేనే.. ప్రత్యర్ధులకు ముచ్చెమటలే.! బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. కివీస్‌ను కూడా మట్టికరిపిస్తుందని అందరూ అనుకున్నారు. గత 12 ఏళ్లలో సొంతగడ్డపై ఓటమి ఎరగని భారత జట్టుకు.. న్యూజిలాండ్ టీం చుక్కలు చూపించింది. బెంగళూరు, పూణే టెస్టుల్లో వరుస విజయాలు అందుకుని.. రోహిత్ సేనకు జలక్ ఇచ్చింది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో కివీస్ 113 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

అనూహ్యంగా జట్టులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్(13/157) కివీస్‌కు భారత గడ్డపై తొలి విజయాన్ని అందించాడు. 359 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్ సేన.. నాలుగో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. కీలక బ్యాటర్లు అయిన గిల్, రోహిత్, పంత్, కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. జైస్వాల్(77), జడేజా(42) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ వరుస ఓటములు డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన ఆరు టెస్టులలో భారత్ కచ్చితంగా నాలుగింట గెలవాల్సిందే. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరగే మూడో టెస్టులో భారత్ గెలిచి తీరాలి. అంతేకాదు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాపై భారత్ 3-2తో గెలవాలి. ఇక ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్‌లో ప్రస్తుతం టీమిండియా(62.8%) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా(62.5%), శ్రీలంక(55.5%), న్యూజిలాండ్(50.0%)తో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టీమిండియా డబ్ల్యూటీసీ లెక్కలు..

View this post on Instagram

A post shared by ESPNcricinfo (@espncricinfo)

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!