'వాషింగ్టన్' అసలు ఈ పేరు సుందర్‌కు ఎలా వచ్చిందంటే

Ravi Kiran

25 October 2024

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోవడమే కాదు.. 

మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు వాషింగ్టన్ సుందర్. 

సుమారు 3 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్ తన స్పిన్ మయాజాలంతో కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

ఇక 'వాషింగ్టన్' అనే పేరు సుందర్‌కి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ పట్ల అభిమానంతో అతని తండ్రి వాషింగ్టన్ సుందర్ అని పేరు పెట్టుకున్నారు. 

సుందర్‌ తండ్రి మణి సుందర్‌ ఒకప్పుడు రంజీ ప్లేయర్‌. ఆయనది పేద కుటుంబం. ఇక మణి సుందర్ చిన్నతనంలో పీ.డీ. వాషింగ్టన్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ అతడు క్రికెట్‌ ఆడేందుకు ఆర్థికంగా సహాయం చేశారు. 

విద్యాభ్యాసానికీ ఆయనకు సహకరించారు. ఆ మాజీ అధికారిపై ప్రేమతో తన కుమారుడికి ‘వాషింగ్టన్‌’ అనే పేరు చేర్చారు. 

ఐపీఎల్‌లో రాణించి 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన సుందర్.. ‘గబ్బా టెస్టు’లో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టాడు.