ధోనీని కించపరుస్తూ ఐసీసీ వీడియో… ఫ్యాన్స్ గరం!

మాంచెస్ట‌ర్‌: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇది భారత్ అభిమానులకు తీవ్ర నిరాశే. అయితే ఈ గాయంపై కారం చల్లినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధోని రన్ ఔట్ పై ఓ వీడియో తీసింది. ఇక ఈ వీడియో ద్వారా ఐసీసీ ధోనిని కించపరిచిందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు ధోని ఔట్ అయ్యాడు. దానిని ఆధారంగా […]

ధోనీని కించపరుస్తూ ఐసీసీ వీడియో... ఫ్యాన్స్ గరం!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 1:40 PM

మాంచెస్ట‌ర్‌: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇది భారత్ అభిమానులకు తీవ్ర నిరాశే. అయితే ఈ గాయంపై కారం చల్లినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధోని రన్ ఔట్ పై ఓ వీడియో తీసింది. ఇక ఈ వీడియో ద్వారా ఐసీసీ ధోనిని కించపరిచిందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.

ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు ధోని ఔట్ అయ్యాడు. దానిని ఆధారంగా చేసుకుని ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. ఇందులో గ‌ప్టిల్‌ను టెర్మినేట‌ర్ సిరీస్ కండ‌ల హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గ‌ర్‌లా చిత్రీక‌రించింది. గ‌ప్టిల్ స్టంప్స్‌ను గురి చూడ‌టం, వాటిని టార్గెట్‌గా చేసుకుని బంతిని నిప్పు క‌ణిక‌లా విస‌ర‌డం, వికెట్ల‌కు త‌గిలిన ఆ బంతి బాంబులా పేలిపోవ‌డం.. ఇవ‌న్నీ గ్రాఫిక్స్ ద్వారా తీర్చిద్దిదారు.

ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు భారత్ అభిమానులు ధోనిని కించపరిచేలా దీన్ని రూపొందించారని మండిపడుతున్నారు. ఈ వీడియోను వెంటనే డిలేట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మ్యాచ్ పోయి బాధలో ఉంటే.. గాయంపై కారం చల్లేలా ప్రవర్తిస్తారా అని ట్విట్టర్ వేదికగా అభిమానులు ఐసీసీని ప్రశ్నిస్తున్నారు.