మా వైపు వస్తే బంగారంలా తీసుకుంటాం..ధోనిపై విలియమ్సన్‌ సరదా వ్యాఖ్యలు

మాంచెస్టర్‌: వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రవీంద్ర జడేజా, ధోని చివరివరకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికి అదృష్టం కలిసిరాలేదు. ధోనిని అదిరిపోయే రేంజ్‌లో రనౌట్ చేసిన గుప్తిల్ భారత క్రీడా అభిమానులు గుండెల్లో చెరిగిపోని గాయం చేశాడు. ధోని అంత స్ట్రాటజీ ప్లే చేసి ఘోర పరాజయం అనే రేంజ్ నుంచి పోరాడి ఓడారు అనే స్థాయికి మ్యాచ్‌ను తీసుకువచ్చినా..కొంతమంది మాజీ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కోట్ల మంది […]

మా వైపు వస్తే బంగారంలా తీసుకుంటాం..ధోనిపై విలియమ్సన్‌ సరదా వ్యాఖ్యలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 11, 2019 | 9:36 PM

మాంచెస్టర్‌: వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రవీంద్ర జడేజా, ధోని చివరివరకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికి అదృష్టం కలిసిరాలేదు. ధోనిని అదిరిపోయే రేంజ్‌లో రనౌట్ చేసిన గుప్తిల్ భారత క్రీడా అభిమానులు గుండెల్లో చెరిగిపోని గాయం చేశాడు. ధోని అంత స్ట్రాటజీ ప్లే చేసి ఘోర పరాజయం అనే రేంజ్ నుంచి పోరాడి ఓడారు అనే స్థాయికి మ్యాచ్‌ను తీసుకువచ్చినా..కొంతమంది మాజీ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కోట్ల మంది ఆశల్ను భుజాలపై మోస్తే తెలుస్తుందని..సరదాగా నాలుగు ట్రోల్స్ వేస్తే..రెండు మెమెస్ చేస్తే అసాధారణ విజయాలు అందించిన భారత్ మాజీ కెప్టెన్‌ చరిత్ర చెరిగిపోదని ‘తలా’ ఫ్యాన్స్ గట్టిగానే బదులిస్తున్నారు.

ధోనిపై వస్తున్న విమర్శలపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు.  ‘ ధోని ఒక వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్‌ అనడంలో సందేహం లేదు. అతని అనుభవం, భారత్‌కు సేవలు వెలకట్టలేనివి. నిన్న నెలకొల్పిన భాగస్వామ్యం తక్కువ చెయ్యలేరు. ధోని తన పౌరసత్వాన్ని మార్చుకుంటే అతన్ని తీసుకోవాలంటూ మా సెలక్షన్‌ కమిటీకి సిఫారుసు చేస్తాం. ప్రస్తుతం మాతో కలిసి ధోని ఆడే అవకాశం లేదు. ధోని మాతో కలిసి ఆడాలనకుంటే పౌరసత్వాన్ని మార్చుకోవాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.

గతంలో కూడా ధోనిపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశాడు. ధోని వీల్‌చైర్‌లో ఉన్నా తన జట్టులో చోటు ఉంటుందని వ్యాఖ్యానించాడు.