Video: 53 ఫోర్లు, 12 సిక్సర్లు.. 3 సెంచరీలతో 468 పరుగులు.. సొంతగడ్డపైనే పాక్ బౌలర్లకు సుస్సు పోయించిన యంగ్ ప్లేయర్..
Pakistan Vs England: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన యంగ్ ప్లేయర్.. మూడు టెస్టుల్లో మూడు సెంచరీలతో సత్తా చాటాడు.

PAK vs ENG: ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. రావల్పిండి, ముల్తాన్ టెస్టు తర్వాత కరాచీలో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోవడంతో టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్ స్వదేశంలో క్లీన్ స్వీప్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందనడంలో సందేహం లేదు. ఆజట్టు దూకుడు తీరుకు పాకిస్థాన్ వద్ద సమాధానం లేకపోయింది. ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లలో 5.50 రన్ రేట్‌తో పరుగులు చేసింది. ఇది ODI ఫార్మాట్‌లో మెరుగైన రన్ రేట్ కూడా. ఈ టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికైన హ్యారీ బ్రూక్ వల్ల పాకిస్థాన్‌కు అత్యధిక నష్టం జరిగింది.
హ్యారీ బ్రూక్ పాకిస్థాన్‌పై 3 టెస్టుల్లో 468 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టెస్టు సిరీస్‌లో హ్యారీ బ్రూక్ 12 సిక్స్‌లు, 53 ఫోర్లు కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హ్యారీ బ్రూక్ స్ట్రైక్ రేట్ 93 కంటే ఎక్కువగా ఉంది. ఇది చాలా మంది ఆటగాళ్ల ODI స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ కావడం విశేషం.




అదరగొట్టిన హ్యారీ బ్రూక్..
Third ? of the series for Harry Brook ?#PAKvENG | #UKSePK pic.twitter.com/GCExZcfyo8
— Pakistan Cricket (@TheRealPCB) December 18, 2022
ఇది హ్యారీ బ్రూక్ మొదటి విదేశీ పర్యటన. రావల్పిండి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ 116 బంతుల్లో 153 పరుగులు చేశాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం కూడా గమనార్హం. ఆ తర్వాత, ముల్తాన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ 108 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. మూడో టెస్టులో హ్యారీ బ్రూక్ 111 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ ఈ టెస్ట్ సిరీస్‌లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు మరియు ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.
సత్తా చాటిన బెన్ డకెట్..
మరో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ కూడా పాక్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఓపెనర్ 71.40 సగటుతో 357 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 95 కంటే ఎక్కువగా ఉంది. బెన్ డకెట్ బ్యాట్ నుంచి ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
పాకిస్థాన్‌కు టెస్టు సిరీస్‌లో ఘోర అవమానం..
ఈ టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్‌కు అత్యంత ఘోర పరాజయంగా అభివర్ణిస్తున్నారు. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలిసారి పాకిస్థాన్ క్లీన్‌స్వీప్‌ను చవిచూసింది. ఇంతకుముందు, పాకిస్తాన్ తన స్వదేశంలో ఎవరితోనూ అన్ని టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లను ఓడిపోలేదు. కానీ, అది బాబర్ కెప్టెన్సీలో జరిగింది. పాకిస్థాన్ వరుసగా స్వదేశంలో ఓడిపోవడం, టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




