Anushka Sharma: విరాట్ రూ. 110 కోట్లు సంపాదించే కంపెనీపై అనుష్క ఫైర్.. ఆ ఫొటోలు తొలగించాలంటూ ఆదేశాలు..
Anushka Sharma vs Puma: అనుష్క శర్మ ఆరోపణలు చేస్తున్న పూమా కంపెనీకి ఆమె భర్త విరాట్ బ్రాండ్ అంబాసిడర్ కావడం గమనార్హం. కాగా, ఈ విషయాన్ని పరిష్కరించాల్సిందిగా పూమా ఇండియాను కూడా విరాట్ కోరాడు.

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల విషయంలో చాలా వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. మరోసారి అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. విరాట్ భార్య, నటి అనుష్క శర్మ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాకు వ్యతిరేకంగా ఒక కథనాన్ని పోస్ట్ చేసింది. అనుమతి లేకుండా పూమా తన ఫోటోను ఉపయోగించిందని అందులో అనుష్క పేర్కొంది. అసంతృప్తిని వ్యక్తం చేసిన అనుష్క, కంపెనీ ఫోటోలను త్వరగా తొలగించాలని కోరింది. అనుష్క శర్మ ఆరోపణలు చేస్తున్న పూమా కంపెనీకి ఆమె భర్త విరాట్ బ్రాండ్ అంబాసిడర్ కావడం గమనార్హం. కాగా, ఈ విషయాన్ని పరిష్కరించాల్సిందిగా పూమా ఇండియాను కూడా విరాట్ కోరాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌లో ఉన్నాడు. అక్కడ అతను డిసెంబర్ 22 నుంచి రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అనుష్క శర్మ స్క్రీన్‌షాట్‌ను ఉంచాడు. పూమా ఇండియా ఈ విషయాన్ని పరిష్కరించాలని రాసుకొచ్చాడు. ఇంతకుముందు అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూమా ఇండియాను ట్యాగ్ చేసి, ‘అనుమతి లేకుండా మీరు నా ఫోటోలను ఏ బ్రాండ్ పబ్లిసిటీ కోసం ఉపయోగించలేరు, ఎందుకంటే నేను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ని కాదు. దయచేసి దాన్ని తీసివేయండి’ అంటూ రాసుకొచ్చింది.
అనుమతి లేని ఫొటోలు వాడకూడదా..





పూమా ఇండియా అనుమతి లేకుండా అనుష్క ఫోటోను సీజన్ సేల్ కోసం ఉపయోగించిందని ఆరోపించింది. దీంతో అనుష్క ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కంపెనీ మార్కెటింగ్ వ్యూహం కూడా అని సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు. కంపెనీ పేరును మరింతగా పెంచేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా వివాదాలు సృష్టిస్తారంటూ చెప్పుకుంటున్నారు.
అనుమతి లేకుండా అనుష్క శర్మ ఫోటో వాడారా?
విరాట్‌తో పూమా రూ.110 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్ కోహ్లీ 2017 నుంచి ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్. ఈ ప్లేయర్‌ను పూమా ఇండియా 8 సంవత్సరాలకు రూ.110 కోట్లకు సంతకం చేసింది. పూమా ఇండియా ప్రతి సంవత్సరం విరాట్ కోహ్లీకి రూ.13.75 కోట్లు ఇస్తుంది. ఈ ఒప్పందం 2025లో ముగుస్తుంది. ఇక పూమా ఇండియా, అనుష్క మధ్య ఈ వ్యవహారం ఎంత వరకు సద్దుమణుగుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




