Year Ender 2022: 3 ఫార్మాట్లు.. ముగ్గురు ప్లేయర్స్.. 2022లో పరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్స్ వీరే..
Year Ender 2022: ఈ సంవత్సరం భారతదేశం తరపున అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాటర్స్ ఉన్నారు. జాబితాలో ఎవరు చేరారో ఇప్పుడు చూద్దాం..

Year Ender 2022: 2022లో ఇప్పటివరకు భారత జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ప్రధాన టోర్నమెంట్‌లను గెలవడంలో విఫలమైన జట్టు గరిష్ట సంఖ్యలో సిరీస్‌లను గెలుచుకుంది. ఈ ఏడాది టీమిండియా మొదట ఆసియా కప్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ను కోల్పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియా మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు, 24 వన్డేలు, 40 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటి వరకు ఈ మూడు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్స్ లిస్టులో ముగ్గురు ఉన్నారు. మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. రిషబ్ పంత్ (టెస్ట్ క్రికెట్)..
ఈ ఏడాది ఇప్పటి వరకు భారత జట్టు మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. పంత్ అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టులో భాగమయ్యాడు. పంత్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 10 ఇన్నింగ్స్‌ల్లో 64.22 సగటుతో 578 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 91.60గా నిలిచింది.
2.శ్రేయాస్ అయ్యర్ (వన్డే క్రికెట్)..
భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది భారత జట్టు కోసం అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రిథమ్‌లో కనిపించాడు. వన్డే క్రికెట్‌లో మాత్రం దంచి కొట్టాడు. అయ్యర్ 2022లో భారత జట్టు తరపున మొత్తం 17 వన్డేలు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో 55.69 సగటుతో 724 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో అతని స్ట్రైక్ రేట్ 91.52గా ఉంది.




3. సూర్యకుమార్ యాదవ్ (టీ20 ఇంటర్నేషనల్స్)..
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. సూర్య ఈ ఏడాది భారత జట్టు తరపున 31 మ్యాచ్‌లు ఆడిన 31 ఇన్నింగ్స్‌ల్లో 46.56 సగటుతో, 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. భారత్‌కే కాదు, ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో కూడా సూర్య ఉన్నాడు. ఈ ఏడాది 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..