AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan: ఆటోగ్రాఫ్ కోరిన అభిమాని.. అప్పటికే దానిపై ధోనీ సంతకం.. ఇషాన్ కిషన్ రియాక్షన్ ఇదీ..

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. ఓ అభిమాని సెల్‌ఫోన్‌పై ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ చూసి షాక్ అయ్యాడు. తాను ఆ పని చేయనంటే చేయనంటూ వెనక్కి వెళ్లిపోయాడు.

Ishan Kishan: ఆటోగ్రాఫ్ కోరిన అభిమాని.. అప్పటికే దానిపై ధోనీ సంతకం.. ఇషాన్ కిషన్ రియాక్షన్ ఇదీ..
Ishan Kishan
Shiva Prajapati
|

Updated on: Dec 21, 2022 | 5:11 AM

Share

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్.. ఓ అభిమాని సెల్‌ఫోన్‌పై ఎంఎస్ ధోని ఆటోగ్రాఫ్ చూసి షాక్ అయ్యాడు. తాను ఆ పని చేయనంటే చేయనంటూ వెనక్కి వెళ్లిపోయాడు. అభిమానికి నిరాశే మిగిల్చాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇషాన్ కిషన్ ప్రస్తుతం జార్ఖండ్‌కు చెందిన రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. కేరళపై తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత.. ఒక అభిమాని అతన్ని సమీపించాడు. ఆటోగ్రాఫ్ కోరాడు. ఇందుకోసం తన మొబైల్ కవర్‌ని తీసి ఇచ్చాడు. అయితే, అది చూసి షాక్ అయ్యాడు ఇషాన్. సంతకం పెట్టనంటే పెట్టనంటూ వెనుదిరిగాడు.

సదరు అభిమాని మొబైల్ కవర్‌పై ఇప్పటికే భారత దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ ఉంది. అదే కవర్‌పై ఇషాన్ ఆటోగ్రాఫ్ కోరాడు. దాంతో వేరే వాటిపై ఆటోగ్రాఫ్ ఇస్తానని, ఆ కవర్‌పై ఇవ్వలేనని స్పష్టం చేశాడు ఇషాన్. కానీ, ఆ అభిమాని ఈ కవర్‌పైనే ఆటోగ్రాఫ్‌ కాలాని అభ్యర్థించాడు. దానికి స్పందించిన ఇషాన్.. ’మాహి భాయ్ ఆటోగ్రాఫ్ ఉంది. ఆయన సంతకం పైన నా ఆటోగ్రాఫ్ ఇచ్చే అంత పెద్ద వాడిని కాదు. అంత వయస్సు ఇంకా రాలేదు’ అని అభిమానికి బదులిచ్చాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ..

జార్ఖండ్, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేరళపై తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ నేతృత్వంలోని కేరళ జట్టు 85 పరుగుల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3వ, చివరి వడ్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో 210 పరుగులు చేశాడు ఇషాన్.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!