Glenn Maxwell: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. హిందూ సాంప్రదాయంలో మ్యాక్సీ భార్య సీమంతం.. ఫొటోస్ చూశారా?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ శుభవార్తను ఆయన భార్య వినీ రామన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మార్చి 27, 2022న, గ్లెన్ మాక్స్‌వెల్ తన చిన్ననాటి స్నేహితురాలు, ఇండియాకు చెందిన వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ శుభవార్తను ఆయన భార్య వినీ రామన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మార్చి 27, 2022న, గ్లెన్ మాక్స్‌వెల్ తన చిన్ననాటి స్నేహితురాలు, ఇండియాకు చెందిన వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు సీమంత కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన విని రామన్.. ఫ్యామిలీకి కొత్త అతిథి వచ్చాడన్న తీపి వార్తని అందించారు. వినీ రామన్ తమిళనాడుకు చెందిన అమ్మాయి కాబట్టి వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి గుర్తుగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు లవ్లీ కపుల్. తమిళనాడు హిందూ సంప్రదాయం ప్రకారమే వినీ రామన్ సీమంతం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుక ఫొటోస్‌ను వినీ రామన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా వినీ రామన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తన భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ఫొటోకి ఫోజులిచ్చాడు.
‘మేము సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడానికి నేను ఆనందిస్తున్నాను’ అంటూ గ్లెన్ మాక్స్‌వెల్ తన భార్యకు రాసిన ప్రత్యేక లేఖను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది వినీ రామన్. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు దూరమైన గ్లెన్ మాక్స్‌వెల్ ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్ ద్వారా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3 టీ20 మ్యాచ్‌లు, 5 వన్డేలు ఆడనుంది. దీని తర్వాత భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడనున్నాడు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
