- Telugu News Photo Gallery Cricket photos Team India Former Captain Virat Kohli only one from the Country Among the top 100 Highest Paid Athletes
Virat Kohli: రికార్డులే కాదు.. సంపాదనలోనూ కోహ్లీదే ఆధిపత్యం.. ఆసియాలో అత్యంత సంపన్న లిస్టులో రెండో స్థానం..
Highest Paid Athlete: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే టాప్ 100 అథ్లెట్లలో కేవలం ఇద్దరు ఆసియన్లు మాత్రమే ఉన్నారు. 2022లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 100లో దేశంలో అత్యంత ప్రసిద్ధ, సంపన్న అథ్లెట్ విరాట్ కోహ్లీ ఒక్కడే కావడం గమనార్హం.
Updated on: Jul 25, 2023 | 3:01 PM

Highest Paid Athlete: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే టాప్ 100 అథ్లెట్లలో కేవలం ఇద్దరు ఆసియన్లు మాత్రమే ఉన్నారు. 2022లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 100లో దేశంలో అత్యంత ప్రసిద్ధ, సంపన్న అథ్లెట్ విరాట్ కోహ్లీ ఒక్కడే కావడం గమనార్హం.

రూ. 1,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన కోహ్లి.. 2022లో స్పోర్టికో అత్యధికంగా ఆర్జించే టాప్ 100 క్రీడాకారుల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న కోహ్లీ, భారత జాతీయ జట్టుకు ఆడటం మినహా ఇతర వైపుల నుంచి $2.9 మిలియన్ల వేతనం పొందుతున్నాడు.

కోహ్లి ప్రకటనల ద్వారా దాదాపు 31 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీ మొత్తం నికర ఆదాయం 33.9 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

2021లో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 100 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ 59వ స్థానంలో నిలిచాడు. కానీ, ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 61వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు కూడా కింగ్ కోహ్లి ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్రికెటర్‌గా నిలిచాడు.

కోహ్లితో పాటు ఆసియాకు చెందిన ఏకైక అథ్లెట్ 25 ఏళ్ల జపాన్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా. ఆమె తన కెరీర్‌లో 4 గ్రాండ్‌స్లామ్‌లు, రెండు యూఎస్ ఓపెన్‌లు, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లను గెలుచుకుంది.

ఒసాకా యూఎస్, యూరోపియన్ అథ్లెట్ల జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. ఆసియా జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

ఒసాకా మొత్తం సంపాదన $53.2 మిలియన్లుగా అంచనా వేశారు. ఇందులో $1.2 మిలియన్లు మాత్రమే మ్యాచ్‌ల ద్వారా వస్తుంది. అయితే $52 మిలియన్లు ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ జాబితాలో ఒసాకా రెండో టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది.





























