- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd test: Ishan Kishan becomes 5th Indian Cricketer to score Fastest Test fifty, check here for top 5 players to achieve this
Team India: నో రోహిత్, నో కోహ్లీ.. అత్యంత వేగంగా ‘టెస్ట్ హాఫ్ సెంచరీ’ చేసిన భారత ఆటగాళ్లు వీరే..
IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అరంగేట్ర హాఫ్ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ ఓ అరుదైన లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ అగ్రస్థానంలో ఉన్న లిస్టులో ఇషాన్ 5వ ఆటగాడిగా చేరాడు. ఇంతకీ ఇషాన్ సాధించిన ఆ ఫీట్ ఏమిటంటే..?
Updated on: Jul 25, 2023 | 8:42 AM

IND vs WI 2nd Test: ఈ సందర్భంగా భారత్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ 35 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకోగా.. ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. దీంతో ఇషాన్ భారత్ తరఫున అత్యంత వేగంగా టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా అవతరించాడు.

ఈ సందర్భంగా భారత్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ 35 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకోగా.. ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. దీంతో ఇషాన్ భారత్ తరఫున అత్యంత వేగంగా టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన 5వ ఆటగాడిగా అవతరించాడు.

ఇంతకీ.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. రిషబ్ పంత్: భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషభ్ పంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో 2022లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డ్ సృష్టించాడు.

2. కపిల్ దేవ్: 1982లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ దేవ్ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఈ లిస్టులో కపిల్ రెండో స్థానంలో ఉన్నాడు.

3. శార్దూల్ ఠాకూర్: శార్దూల్ ఠాకూర్ 2021లో ఇంగ్లండ్‌పై 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

4. వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ 2008లో ఇంగ్లండ్‌పై కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

5. ఇషాన్ కిషన్: తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఫిఫ్టీ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు.





























