- Telugu News Photo Gallery Cricket photos Ruturaj gaikwad next chennai super kings captain says ambati rayudu key statement ms dhoni ipl 2024
ధోని వారసుడు ఇతడే.. వచ్చే పదేళ్ల పాటు చెన్నై సారథిగా కీలక బాధ్యతలు.. అంబటి రాయుడు కీలక ప్రకటన
CSK Captain: ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ఎవరు చేపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చెన్నై జట్టు వచ్చే సీజన్‌లో కొత్త కెప్టెన్‌ని చేస్తుందా లేదా ధోనీ జట్టు బాధ్యతలు మరో తీసుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.
Updated on: Jul 24, 2023 | 6:51 PM

ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ఎవరు చేపడతారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చెన్నై జట్టు వచ్చే సీజన్‌లో కొత్త కెప్టెన్‌ని చేస్తుందా లేదా ధోనీ జట్టు బాధ్యతలు మరో తీసుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో చెన్నై జట్టులో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు చెన్నై తదుపరి కెప్టెన్‌పై కీలక ప్రకటన చేశాడు.

ధోని తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా ఎవరరేది ఇప్పటికే గుర్తించామని అంబటి రాయుడు అన్నాడు. అంబటి ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ రితురాజ్ గైక్వాడ్‌లో నాయకత్వ లక్షణాలను కనబరిచింది.

రానున్న కాలంలో గైక్వాడ్‌కు కెప్టెన్‌గా అవకాశం వస్తుందని రాయుడు అన్నాడు. గైక్వాడ్ వచ్చే పదేళ్ల పాటు చెన్నై జట్టుకు నాయకత్వం వహించగలడని రాయుడు చెప్పుకొచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడనే విషయం తెలిసిందే. 2021, 2023 సంవత్సరాలలో చెన్నైని ఛాంపియన్‌గా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. గైక్వాడ్ ఐపీఎల్ 2023లో 42కి పైగా సగటుతో 590 పరుగులు చేశాడు. 2021లో, ఈ ఆటగాడు 45 కంటే ఎక్కువ సగటుతో 635 పరుగులు చేశాడు.

అలాగే రీతురాజ్ గైక్వాడ్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదని రాయుడు అన్నాడు. టీమిండియా గురించి మాట్లాడుతూ గైక్వాడ్‌ను మూడు ఫార్మాట్లలో ఆడించాలి. అయితే, అది ఇప్పుడు జరగకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.





























