- Telugu News Photo Gallery Cricket photos Indian bowler Ravichandran Ashwin 2nd place with most wickets in international cricket
Team India: అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే.. లిస్టులో అగ్రస్థానం ఎవరిదో తెలుసా?
R Ashwin: భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 24, 2023 | 5:43 PM

India Vs West Indies: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న 2వ టెస్టులో రవిచంద్ర అశ్విన్ మొత్తం 3 వికెట్లు పడగొట్టి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అది కూడా హర్భజన్ సింగ్‌ను అధిగమించడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. దీంతో భారత్‌లో 2వ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

మరి అంతర్జాతీయ క్రికెట్‌లో (ఆసియా ఎలెవన్‌తో సహా) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం...

1- అనిల్ కుంబ్లే: ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మొత్తం 956 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

2- రవిచంద్రన్ అశ్విన్: మొత్తం 712 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

3- హర్భజన్ సింగ్: టర్బనేటర్ ఫేమ్ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.

4- కపిల్ దేవ్: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మొత్తం 687 వికెట్లు పడగొట్టాడు.

5- జహీర్ ఖాన్: టీమిండియా మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జహీర్ ఖాన్ ఈ జాబితాలో మొత్తం 610 వికెట్లతో 5వ స్థానంలో ఉన్నాడు.




