- Telugu News Photo Gallery Cricket photos WTC Standings 2023 25 Australia retain 3rd spot Pakistan 2nd spot in point table check India place WTC Final 2025
WTC Final 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇదే జరిగితే భారత్, పాకిస్తాన్‌ల మధ్యే డబ్ల్యూటీసీ ఫైనల్..
WTC Standings 2023-25: ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా 100 శాతం విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగించింది.
Updated on: Jul 24, 2023 | 4:46 PM

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ 4వ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీనితో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 3వ ఎడిషన్ పాయింట్ల జాబితాలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.

ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా 100 శాతం విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్, డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికాతో తదుపరి టెస్టు సిరీస్ ఆడనుంది.

తొలి టెస్టులో శ్రీలంకను ఓడించిన పాక్ క్రికెట్ జట్టు 100 శాతం విజయంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పట్టిక ఇలాగే కొనసాగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి.

అలాగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 3వ ఎడిషన్‌ను 5 మ్యాచ్‌ల యాషెస్ టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించిన ఆస్ట్రేలియా.. టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది.

చివరి టెస్టులో ఆసీస్ గెలిస్తే యాషెస్ సిరీస్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లే అవకాశం ఉంది. యాషెస్ తర్వాత ఆస్ట్రేలియా డిసెంబర్-జనవరిలో స్వదేశంలో పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో 1-2తో వెనుకబడిన ఇంగ్లండ్ 27.78 విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది.

పాకిస్థాన్‌తో ఆడిన 1 మ్యాచ్‌లో ఓడిపోయిన శ్రీలంక పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.




