Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Hundreds: టెస్టుల్లో సెంచరీల దూకుడు.. టాప్ 5లో ఇద్దరు భారతీయులు.. ఫ్యాబ్-4లో అగ్రస్థానం ఎవరిదంటే?

Most Test Hundred: టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో సచిన్‌ పేరిట 51 సెంచరీలు ఉన్నాయి. అయితే ఫ్యాబ్-4 టాప్-10లో చేరలేదు.

Test Hundreds: టెస్టుల్లో సెంచరీల దూకుడు.. టాప్ 5లో ఇద్దరు భారతీయులు.. ఫ్యాబ్-4లో అగ్రస్థానం ఎవరిదంటే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2023 | 1:35 PM

Most Centuries In Test Cricket: టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు లార్డ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో సచిన్‌ పేరిట 51 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక సెంచరీలు చేసిన టాప్-10 బ్యాట్స్‌మెన్‌లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. అయితే ఫ్యాబ్-4 టాప్-10లో చేరలేదు. సచిన్ తర్వాత జాక్వెస్ కలిస్ (45 సెంచరీలు), రికీ పాంటింగ్ (41 సెంచరీలు) ఉన్నారు.

టాప్-10లో ముగ్గురు భారతీయులు..

అత్యధిక సెంచరీల పరంగా కుమార సంగక్కర (38 సెంచరీలు) నాలుగో స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ 36 సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు. దీంతో టాప్-5లో మొత్తంగా ఇద్దరు టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన యూనిస్ ఖాన్ (34 సెంచరీలు), భారత్‌కు చెందిన సునీల్ గవాస్కర్ (34 సెంచరీలు), వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా (34 సెంచరీలు), శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే (34 సెంచరీలు), ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్ (33 సెంచరీలు) ఈ జాబితాలో చేరారు.

ఫ్యాబ్-4 పరిస్థితి..

ఫ్యాబ్-4 గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ , జో రూట్ వీరంతా టాప్-10 జాబితాలో లేరు. అయితే వీరిలో స్టీవ్ స్మిత్ ముందు వరుసలో ఉన్నాడు. స్మిత్ ఇప్పటి వరకు 31 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ రూట్‌ పేరిట 30 సెంచరీలు ఉన్నాయి. దీని తర్వాత కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇద్దరి ఖాతాలో 28 సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫాబ్-4లో జో రూట్ అగ్రస్థానంలో..

ఫ్యాబ్-4 గురించి మాట్లాడితూ, జో రూట్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రూట్ పేరుతో 11,122 పరుగులు నమోదయ్యాయి. స్టీవ్ స్మిత్ 8,947 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 8479 పరుగులతో నిలిచాడు. చివరిగా కేన్ విలియమ్సన్ 8124 పరుగులతో చివరి స్థానంలో చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..