Prithvi Shaw: ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయిన పృథ్వీ షా జీవన ప్రయాణం!

పృథ్వీ షా, తన టాలెంట్‌తో భారత క్రికెట్‌లో మెరిసిన స్టార్, ఇప్పుడు ఐపీఎల్ 2025 వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఫిట్‌నెస్ సమస్యలు, గాయాలు, స్థిరమైన ఫామ్ లేమి అతని ఆట జీవితానికి అడ్డంకిగా మారాయి. తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, వ్యక్తిగత ప్రతికూలతలను అధిగమించి షా తిరిగి పునరుద్ధరించగలడా అన్నది ప్రశ్న.

Prithvi Shaw: ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ అయిన పృథ్వీ షా జీవన ప్రయాణం!
Prithvi Shaw
Follow us
Narsimha

|

Updated on: Dec 07, 2024 | 6:06 PM

పృథ్వీ షా, భారత క్రికెట్‌లో ఇతని పేరు ఒకప్పుడు మారుమోగింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో అన్ సోల్డ్ గా మిగిలిపోవడంమే కాదు వివాదాలు తన చుట్టు ఉన్న యువ క్రికెటర్‌గా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో 75 లక్షల ప్రాథమిక ధరతో అందుబాటులో ఉన్నప్పటికీ, అతని పేరు ఎవరూ పట్టించుకోకపోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. అంతకుముందు 2018లో టెస్ట్ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు చూపిన షా, తర్వత అంతగా ప్రభావం చూపలేకపోయాడు.

అతను దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టి తన ప్రదర్శనతో ఆకర్షించినా, గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేకపోవడం అతని జాతీయ జట్టు ప్రయాణానికి అడ్డంకిగా మారాయి. ఈనాటి అతని పరిస్థితి చూసినప్పుడు, అతని బ్యాక్‌స్టోరీ కంటే మందిని మరింత కదిలించే విషయం ఇంకోటి ఉండదు.

పృథ్వీ షా తల్లి చిన్నవయసులోనే మరణించడంతో, అతను తండ్రి సహకారంతో తన జీవితాన్ని ముందుకు నడిపాడు. అయితే, ఆ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. “తల్లి ఉంటే పృథ్వీకి మార్గనిర్దేశం లభించేదేమో. తల్లి లేకుండా పెరిగి, ఆర్థిక కష్టాలను చూసి, అతను తన చిన్న వయసులోనే అనేక జటిల పరిస్థితులను ఎదుర్కొన్నాడు” అని అతని పాఠశాల కోచ్ రాజు పాఠక్

ఆర్థికంగా వెనుకబడిన జీవితంలో నుంచి అకస్మాత్తుగా క్రికెట్ ద్వారా సంపాదించిన విజయాలు, డబ్బు, పేరు షాకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి. కానీ, ఈ ఊహించని విజయంతో అతను కొంత అదుపు తప్పినట్లుగా అనిపిస్తోంది. షా ఇంకా 25 ఏళ్ల యువకుడు అని, అతని వయస్సుకు తగిన ప్రవర్తనే చూపిస్తున్నాడు అని, 40 ఏళ్ల పరిణతి ఉన్న వ్యక్తిలా ప్రవర్తించాల్సిన బాధ్యత పెట్టడం అన్యాయమే అని కొందరు భావిస్తున్నారు.

మరోవైపు, షా ఫిట్‌నెస్‌పై ఎక్కువ ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేసిన ప్రవీణ్ ఆమ్రే, “షా తన ఫిట్‌నెస్‌పై మరింత కఠినంగా శ్రమించాలి. అతని టాలెంట్‌పై ఎవరికి సందేహం లేదు. కానీ ఫిట్‌నెస్ లేకపోవడం అతనికి పెద్ద అడ్డంకిగా మారింది. అతను తనను తాను ప్రేరేపించుకుని ఈ పరిస్థితిని దాటాలి,” అని అన్నారు.

షా కథ అనేక ఒడిదుడుకులతో నిండిన జీవన ప్రయాణం. అతను గాయపడ్డ చోటు నుంచి తిరిగి రావాలన్న ఆత్మస్థైర్యం ప్రదర్శిస్తాడా, లేక మరింత వెనుకబడతాడా అనేది వేచి చూడాలి.