Border Gavaskar Trophy: ఇదెక్కడి రికార్డ్ అండి బాబు! వరుసగా 1, 2, 3 స్థానాలు కైవసం చేసుకున్న ఇండియా పాలిట యముడు…
ట్రావిస్ హెడ్, తన దాడి ధోరణితో డే-నైట్ టెస్టుల్లో భారత బౌలర్లను నిశ్చేష్టులను చేశాడు. 111 బంతుల్లోనే ట్రిపుల్ ఫిగర్స్ చేరుకుంటూ, అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా హెడ్ డే-నైట్ టెస్టు చరిత్రలో నిలిచిపోయాడు.
ట్రావిస్ హెడ్ మరోసారి తన దూకుడు బ్యాటింగుతో భారత బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. అడిలైడ్లో జరుగుతున్న రెండో డే-నైట్ టెస్టులో, రెండో రోజు అతని బ్యాటింగ్ భారత జట్టుపై ప్రభావం చూపింది. కేవలం 111 బంతుల్లోనే ట్రిపుల్ ఫిగర్స్ నంబర్ స్కోరు సాధించాడు. దీంతో టీమిండియాపౌ మరో అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో హెడ్ 17 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో కేవలం 141 బంతుల్లో 140 పరుగులు చేసాడు. డే-నైట్ టెస్టుల్లో ఏ బ్యాటర్ చేయలేని రీతిలో అతను వేగవంతమైన సెంచరీ చేసిన ఘనత సాధించాడు. అంతేకాదు, ఈ ఫీట్‌ను సాధించడం ద్వారా డే-నైట్ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాళ్లలో హెడ్ ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.
ఇది మాత్రమే కాదు, డే-నైట్ టెస్టు చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండవ, మూడవ సెంచరీల రికార్డులు కూడా హెడ్ పేరునే ఉన్నాయి. 2022లో హోబర్ట్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 112 బంతుల్లోనే అతడు రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అదే ఏడాది అడిలైడ్ ఓవల్‌లో వెస్టిండీస్‌పై 125 బంతుల్లో మరో శతకం సాధించాడు.
ట్రావిస్ హెడ్ ఇలాంటి ప్రదర్శనల ద్వారా ముక్కుసూటిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగల సామర్థ్యాన్ని సుస్పష్టం చేశాడు. ఈ సెకండ్ టెస్టులో అతని ఇన్నింగ్స్, అడిలైడ్ పిచ్‌పై చరిత్ర సృష్టించడమే కాకుండా, తన పేరు వినగానే ప్రత్యర్థి జట్లలో భయం కలిగించే విధంగా నిలిచింది.