AUS vs IND: మళ్లీ నిరాశపర్చిన టీమిండియా బ్యాటర్లు.. పింక్ బాల్ టెస్టులో పట్టు బిగించిన ఆస్ట్రేలియా
అడిలైడ్ వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు మళ్లీ నిరాశపర్చారు. అంతకు ముందు ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆసీస్ కు మొదటి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో రోజు కూడా ఆధిపత్యం కొనసాగింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ డే నైట్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా గట్టి పట్టు సాధించింది. రెండోరోజు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. రిషబ్ పంత్, నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకు ఆలౌటవగా ఆస్ట్రేలియా 87.3 ఓవర్లలో 337 పరుగులు చేసింది . దీంతో కంగారూలు 157 పరుగుల ఆధిక్యం సాధించించారు. ట్రావిస్ హెడ్ 140 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్నస్ లాబుస్చెన్ 64 పరుగులు చేశాడు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 4 వికెట్లు తీశారు. ఆర్ అశ్విన్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.
157 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా బ్యాటర్లు పూర్తిగా నిరాశ పర్చారు.కేఎల్ రాహుల్ 7, యశస్వి జైస్వాల్ 24, విరాట్ కోహ్లీ 11, శుభ్‌మన్ గిల్ 28, రోహిత్ శర్మ 6 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. మూడో రోజు ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశాడు.
పంత్, నితీష్ రెడ్డిపైనే ఇక ఆశలన్నీ..
That’s Stumps on Day 2#TeamIndia trail by 29 runs with Rishabh Pant and Nitish Kumar Reddy in the middle
Updates ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/ydzKw0TvkN
— BCCI (@BCCI) December 7, 2024
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్:
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Innings Break!
Siraj gets the final wicket as Australia are all out for 337 runs.
Four wickets apiece for Jasprit Bumrah and Mohammed Siraj.
33 overs remaining in the day.
Scorecard – https://t.co/urQ2ZNmHlO… #AUSvIND pic.twitter.com/Xh05tmROCP
— BCCI (@BCCI) December 7, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..