టాస్‌కి ఆలస్యంగా వచ్చిన కెప్టెన్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్ ఇచ్చిన బోర్డ్..
John Campbell Banned: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన ఆటగాడు జాన్ క్యాంప్‌బెల్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించింది. అయితే, ఇందుకు గల కారం చూస్తే మాత్రం చాలా వింతగా అనిపిస్తోంది.
West Indies Cricket Board: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన ఆటగాడు జాన్ కాంప్‌బెల్‌పై కఠిన చర్యలు తీసుకుంది. వెస్టిండీస్‌లో జరగనున్న దేశీయ టోర్నమెంట్ సూపర్50 చివరి మ్యాచ్ జమైకా స్కార్పియన్స్ వర్సెస్ బార్బడోస్ ప్రైడ్ మధ్య జరగాల్సి ఉంది. కానీ జమైకా కెప్టెన్ జాన్ క్యాంప్‌బెల్ టాస్ సమయానికి సిద్ధంగా లేకపోవడంతో, ఆన్-ఫీల్డ్ అంపైర్ చాలా సీరియస్ అయ్యాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు క్యాంప్‌బెల్ చేసిన చర్యలకు అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది.
కాంప్‌బెల్ ఏం చేశాడంటే?
31 ఏళ్ల క్యాంప్‌బెల్ జమైకా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2024 నవంబర్ 23న బార్బడోస్ ప్రైడ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, మ్యాచ్ రోజు వర్షం కురవడంతో 20-20 ఓవర్లలోనే మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. మైదానం పరిస్థితులు ఆడేందుకు అనువుగా మారినప్పుడు, కెప్టెన్లను టాస్‌కు పిలిచారు. క్యాంప్‌బెల్ సమయానికి రాలేకపోయాడు. దీంతో అంపైర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్‌బెల్ కాకుండా, బార్బడోస్ కెప్టెన్ రీమాన్ రీఫర్ కూడా రాలేదు. అతనికి ఎలాంటి శిక్ష పడనుందో తెలియదు. కానీ, క్యాంప్‌బెల్ తన చర్యలకు లెవల్ 3కి దోషిగా తేలాడు. దీని కారణంగా అతను నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. క్యాంప్‌బెల్ కూడా దానిని అంగీకరించాడు.
క్షమాపణలు చెప్పిన కాంప్‌బెల్..
సూపర్50 ఫైనల్ గురించి మాట్లాడితే, వర్షం కారణంగా దాని ఫలితం ప్రకటించలేదు. 20-20 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాలేదు. దీని కారణంగా 2024-25 సీజన్‌లో ఇంకా ఏ జట్టును విజేతగా ప్రకటించలేదు. కాగా, 31 ఏళ్ల క్యాంప్‌బెల్ వెస్టిండీస్ తరపున 20 టెస్టులు, 6 వన్డేలు, రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. కాంప్‌బెల్ తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్‌లో ఏదైనా అంతరాయం కలిగితే నేను క్షమాపణలు కోరుతున్నాను. అంపైర్లు, మ్యాచ్ అధికారులకు నేను సమస్యలను కలిగించానని అంగీకరిస్తున్నాను. ఆటకు చెడ్డపేరు తెచ్చే ఉద్దేశం నాకు లేదంటూ ట్వీట్ చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..