Siraj vs Head Fight Video: అడిలైడ్‌ను హీటెక్కించిన సిరాజ్.. మైదానంలో ట్రావిస్ హెడ్‌తో ఢిష్యూం, ఢిష్యూం
Siraj vs Travis Head Fight: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో హీట్ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇరుజట్ల మధ్య మైదానంలో ఎన్నో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అడిలైడ్ నుంచి ఇలాంటి వాతావరణమే కనిపించింది. సిరాజ్, హెడ్ ముఖాముఖిగా తలపడే సీన్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Siraj vs Travis Head Fight: అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు రెండో రోజు మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ తలపడ్డారు. మైదానం మధ్యలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇలాంటి చిత్రాలు కనిపించడం మామూలే. అయితే, అడిలైడ్‌లో సిరాజ్, హెడ్ ఒకరినొకరు ఆగ్రహంతో ఊగిపోవడానికి ఓ కారణం ఉంది. ఈ గొడవ తెలియాలంటే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లోని 82వ ఓవర్‌లో ఏం జరిగిందో చూడాల్సిందే. సిరాజ్ వేసిన ఓవర్లో 4 బంతుల్లో వాతావరణం అంతా మారిపోయింది.
సిరాజ్ వర్సెస్ హెడ్ ముఖాముఖిగా..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్ వేయడానికి వచ్చిన సిరాజ్ వేసిన తొలి బంతికి ట్రావిస్ హెడ్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి అతను రన్ చేయలేకపోయాడు. సిరాజ్ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి హెడ్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి సిరాజ్ వికెట్లను చెదరగొట్టాడు. ఆ తర్వాత సిరాజ్ ఆవేశంలో ఊగిపోయాడు. ఈ క్రమంలో హెడ్ కూడా ధీటుగా సిరాజ్ వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు చూసుకుంటూ దూకుడుగా కనిపించారు.
హీట్ పెంచిన ట్రావిస్ హెడ్ సెంచరీ ఇన్నింగ్స్..
Australian Crowd booing you means you are on right path💉✨ They boo even King Virat Kohli in Past. #INDvsAUSpic.twitter.com/dDWVd0hh4R
— Mufaddal Parody (@mufaddal_voira) December 7, 2024
భారత్‌పై హెడ్‌కి ఉన్న ప్రేమ ప్రపంచ క్రికెట్‌లో ప్రసిద్ధి చెందింది. అడిలైడ్‌లో కూడా అతను టీమ్ ఇండియాపై సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ టెస్టులో, అతను 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. భారత్‌పై చివరి 6 ఇన్నింగ్స్‌ల్లో ఇది అతనికి రెండో సెంచరీ, నాలుగో ఫిఫ్టీ ప్లస్ స్కోరు.
ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్‌ను దాటడమే కాకుండా భారీ ఆధిక్యాన్ని కూడా సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. అడిలైడ్ టెస్టులో ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ ఫలితం తేలిపోతుందని ఇప్పటికే అర్థమైంది. రెండో రోజు మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 337పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ జట్టు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో 4 వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..