AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: బాబోయ్.. నమ్మడం కష్టమే.. కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ కాని క్రికెటర్లు.. టాప్ 5 లిస్టులో మనోడు కూడా

Unique Cricket Records: క్రికెట్ ఆటలో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియదు. చివరి బంతి వరకు టెన్షన్‌గానే ఉంటుంది. ఇలాంటి ఉత్కంఠభరితైమైన క్రీడలో.. ఎన్నో రికార్డులు, మరెన్నో రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా ఐదుగురు గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వీరు టెస్టు ఫార్మాట్‌లో ఎన్నడూ రనౌట్ కాలేదు.

Cricket Records: బాబోయ్.. నమ్మడం కష్టమే.. కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ కాని క్రికెటర్లు.. టాప్ 5 లిస్టులో మనోడు కూడా
Unique Cricket Records Run
Venkata Chari
|

Updated on: Oct 05, 2024 | 9:55 AM

Share

Unique Cricket Records: క్రికెట్ ఆటలో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియదు. చివరి బంతి వరకు టెన్షన్‌గానే ఉంటుంది. ఇలాంటి ఉత్కంఠభరితైమైన క్రీడలో.. ఎన్నో రికార్డులు, మరెన్నో రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా ఐదుగురు గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వీరు టెస్టు ఫార్మాట్‌లో ఎన్నడూ రనౌట్ కాలేదు. ఈ జాబితాలో భారత వెటరన్ క్రికెటర్ కూడా చేరాడు. వారెవరో ఓసారి చూద్దాం..

1. పీటర్ మే..

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, తెలివైన బ్యాట్స్‌మెన్ పీటర్ మే తన కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు. అతను చాలా క్లాసిక్ బ్యాట్స్‌మన్. అద్భుతమైన కెప్టెన్. పీటర్ మే 1951లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పీటర్ మే ఇంగ్లండ్ తరపున 66 టెస్టు మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీలతో సహా 4537 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 235. వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తేవాడు.

2. గ్రాహం హిక్..

జింబాబ్వేలో జన్మించిన గ్రాహం హిక్ ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడాడు. అతను ఇంగ్లాండ్ తరపున 65 టెస్టులు, 120 ODI మ్యాచ్‌లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 3000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. గ్రాహం హిక్ తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ రనౌట్ కాలేదు. ఇంగ్లండ్‌కు తన సొంతంగా ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు.

3. ముదస్సర్ నాజర్..

పాకిస్తాన్ మొత్తం ప్రపంచానికి చాలా మంది బౌలర్‌లను అందించింది. అయితే, తన కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ అవ్వని పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఒకరు ఉన్నారు. అతని పేరు ముదస్సర్ నాజర్. ముదస్సర్ నాజర్ పాకిస్థాన్ తరపున 76 టెస్టు మ్యాచ్‌ల్లో 4114 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి. 122 ODIలు ఆడితే, నాజర్ 2653 పరుగులు చేశాడు. అతను చాలా వేగంగా పరిగెత్తేవాడు. మదాసర్ నాజర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నారు.

4. కపిల్ దేవ్..

కపిల్ దేవ్, ఈ పేరు భారత అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 1983లో వెస్టిండీస్ జట్టును ఓడించి కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. జింబాబ్వేపై కపిల్ (కపిల్ దేవ్) 175 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కపిల్ దేవ్ ఎల్లప్పుడూ తన బలమైన బ్యాటింగ్, కిల్లర్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. కపిల్ భారత్ తరపున 131 టెస్టు మ్యాచ్‌లు ఆడి 5248 పరుగులు, 434 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అతను వన్డే క్రికెట్‌లో 3000 కంటే ఎక్కువ పరుగులు, 253 వికెట్లు తీసుకున్నాడు. కపిల్ దేవ్ తన మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

5. పాల్ కాలింగ్‌వుడ్..

మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ఆడిన పాల్ కాలింగ్‌వుడ్ చాలా అద్భుతమైన బ్యాట్స్‌మెన్. ఇంగ్లిష్ జట్టు తరపున 68 టెస్టు మ్యాచ్‌ల్లో నాలుగు వేలకు పైగా పరుగులు చేశాడు. అతను తన దూకుడు ఇన్నింగ్స్‌తో గుర్తుండిపోతాడు. పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 2010 ICC T20 వరల్డ్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ క్రికెటర్ తన టెస్టు కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..