Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెప్టెన్లను మార్చి బరిలోకి.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లో సంచలనాలు సృష్టిస్తోన్న 3 జట్లు

IPL 2025 New Captains Ruling in Points Table: ఐపీఎల్ (IPL) 2025లో 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు ట్రోఫీ గెలవని జట్లు ఈ ఏడాది అద్భుతాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో గతంలో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్లను మార్చి బరిలోకి.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లో సంచలనాలు సృష్టిస్తోన్న 3 జట్లు
Ipl 2025 New Captains
Follow us
Venkata Chari

|

Updated on: Apr 07, 2025 | 6:15 PM

IPL 2025 New Captains Ruling in Points Table: ఐపీఎల్ (IPL) 2025లో 19 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు సాధారణంగా వెనుకంజలో నిలిచిన జట్లు ఈసీజన్‌లో అద్భుతాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్లు ఇబ్బంది పడుతున్నాయి. అంటే, ఈ సీజన్‌లో కెప్టెన్లను మార్చిన జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నమాట.

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లలో, ఈ సీజన్‌కు ముందు కెప్టెన్‌ను మార్చి ఇంకా టైటిల్ గెలవని మూడు జట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025కి ముందు కెప్టెన్‌ను మార్చని, ఒకసారి ట్రోఫీని గెలుచిన ఏకైక జట్టు గుజరాత్ టైటాన్స్ టాప్ 4లో నిలిచింది.

ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ను మార్చి అక్షర్ పటేల్‌కు ఆ బాధ్యతను అప్పగించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. అక్షర్ తొలిసారి ఐపీఎల్ కెప్టెన్ అయ్యాడు. ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌లో ఢిల్లీ ఇబ్బంది పడింది. 2020లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడింది. కానీ, టైటిల్ కరువు ఇంకా కొనసాగుతోంది.

ఐపీఎల్‌లో అత్యంత ఫేవరేట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి రజత్ పాటిదార్ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్నాడు. రజత్ సారథ్యంలో ఆర్‌సీబీ జట్టు మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి మూడవ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది. పాటీదార్ తొలిసారి ఐపీఎల్ కెప్టెన్ అయ్యాడు.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. అతను కోల్‌కతాను విడిచిపెట్టి ఈ జట్టులో చేరాడు. కెప్టెన్సీ మార్పు వల్ల పంజాబ్ లాభపడింది. పంజాబ్ జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి నాల్గవ స్థానంలో ఉంది. పంజాబ్ కూడా ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు.

కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఐపీఎల్ 2025 కోసం కెప్టెన్లను మార్చాయి. ఢిల్లీ నుంచి వచ్చిన రిషబ్ పంత్ లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, అజింక్య రహానే కోల్‌కతాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండు జట్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించాయి.

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు గత సీజన్‌లో ఆడిన కెప్టెన్లతోనే ఈ సీజన్‌లో ఆడుతున్నాయి. ఈ 4 జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి-4 స్థానాల్లో ఉన్నాయి. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా, చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, హైదరాబాద్ జట్టుకు పాట్ కమ్మిన్స్, రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరంగా నాలుగు జట్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..