AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: క్రికెట్‌ను వీడి వ్యాపారంలోకి ఎంట్రీ.. కట్‌చేస్తే.. రూ. 8.5 లక్షల కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా ఆర్ఆర్ మాజీ ప్లేయర్

Aryaman Vikram Birla turns businessman: క్రికెట్‌లో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తేందుకు వచ్చిన ఆర్యమాన్ విక్రమ్ బిర్లా వ్యాపారవేత్తగా మారాడు. క్రికెట్‌తో పాటు వ్యాపారాలు చేస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారు. అయితే ఆర్యమన్ క్రికెట్ ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. వాస్తవానికి, 2019 సంవత్సరంలో, ఆర్యమాన్ మానసిక సమస్యల కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. అతను 2017-18లో మధ్యప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు.

Cricket: క్రికెట్‌ను వీడి వ్యాపారంలోకి ఎంట్రీ.. కట్‌చేస్తే.. రూ. 8.5 లక్షల కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా ఆర్ఆర్ మాజీ ప్లేయర్
Aryaman Vikram Birla
Venkata Chari
|

Updated on: Aug 16, 2024 | 12:36 PM

Share

Aryaman Vikram Birla turns businessman: క్రికెట్‌లో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తేందుకు వచ్చిన ఆర్యమాన్ విక్రమ్ బిర్లా వ్యాపారవేత్తగా మారాడు. క్రికెట్‌తో పాటు వ్యాపారాలు చేస్తున్న క్రీడాకారులు ఎందరో ఉన్నారు. అయితే ఆర్యమన్ క్రికెట్ ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. వాస్తవానికి, 2019 సంవత్సరంలో, ఆర్యమాన్ మానసిక సమస్యల కారణంగా క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. అతను 2017-18లో మధ్యప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. IPL 2018లో రాజస్థాన్ రాయల్స్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, అతను అరంగేట్రం చేసే అవకాశం పొందలేదు. ఆ తరువాత 2020 సీజన్‌కు ముందు విడుదలయ్యాడు.

వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆర్యమాన్..

క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆర్యమాన్ విక్రమ్ బిర్లా వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డులలో చేరాడు. దీనితో పాటు ముంబైలో ‘జోలీస్’ అనే క్లబ్‌ను కూడా ఆర్యమాన్ ప్రారంభించాడు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆర్యమాన్ క్లబ్‌కు వస్తుంటారు. ఇందులో వారు తమ ప్రయాణం గురించి చెబుతుంటారు.

క్రికెట్ నుంచి విరామం తర్వాత వ్యాపారం: ఆర్యమాన్ బిర్లా

ఆర్యమాన్ విక్రమ్ బిర్లా 9 జులై 1997న జన్మించారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు. క్రికెట్‌కు విరామం ఇచ్చిన తర్వాత, అతను తన కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. బిర్లా గ్రూప్ దేశంలోని ప్రముఖ, పురాతన పారిశ్రామిక సంస్థలలో ఒకటని తెలిసిందే. అంతే కాకుండా కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే పెంపుడు కుక్కల కోసం ‘పావ్‌స్టార్‌ కంపెనీ’ని ప్రారంభించాడు.

ఆర్యమాన్ తండ్రి ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత..

2023లో, ఆర్యమాన్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ డైరెక్టర్‌లలో ఒకరిగా నియమితులయ్యారు. ఆర్యమాన్ తండ్రి కుమార్ మంగళం బిర్లా భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన సమ్మేళనాలలో ఒకటైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అతను విజయవంతమైన పారిశ్రామికవేత్త. ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. ఇది వివిధ రంగాలలో విస్తరించి ఉన్న సమూహం. ఆర్యమాన్ తండ్రి ఆదిత్య బిర్లా గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?